Begin typing your search above and press return to search.

చిన్నతనంలో రాహుల్ తో ప్రియాంక... రాఖీ వేళ పిక్స్ వైరల్!

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తన "ఎక్స్" ఖాతాలో ఆసక్తికర పోస్ట్ ను షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   19 Aug 2024 3:30 PM GMT
చిన్నతనంలో రాహుల్  తో ప్రియాంక... రాఖీ వేళ పిక్స్  వైరల్!
X

రాఖీ పౌర్ణమి వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కడుతూ ప్రేమను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రియాంక చెప్పిన విషెస్ ఆసక్తిగా మారాయి.

అవును... రాఖీ పౌర్ణమి వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ములకు రాఖీలు కడుతూ తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన రాహుల్ గాంధీ... సోదర సోదరీమణుల మధ్య విడదీయరాని ప్రేమ, అనురాగాల పండుగ రక్షా బంధన్.. ఈ పండుగ సందర్భంగా దేశప్రజలందరికీ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తన "ఎక్స్" ఖాతాలో ఆసక్తికర పోస్ట్ ను షేర్ చేశారు. ఇందులో భాగంగా తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి చిన్నతనంలో ఆడుకుంటూ, తన తండ్రి రాజీవ్ గాంధీతో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఓ సోదరీ సోదరుడు మధ్య సంబంధం ఒక పూలచెట్టు లాంటింది. దీనిలో విభిన్న రంగుల జ్ఞాపకాలు.. కలయిక కథలు.. స్నేహాన్ని మరింతగా పెంచుకొవాలనే సంకల్పం, గౌరవం, ప్రేమ, పరస్పర అవగాహన పునాదిపై వర్ధిల్లుతాయి. సోదరసోదరీమణుల పోరాటంలో సహచరుల జ్ఞాపకాలు కూడా ఉంటాయి. మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు అని ప్రియాంక పేర్కొన్నారు.

దీంతో... ఈ పోస్ట్ పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. అన్నింటికంటే ముందుగా ప్రియాంక – రాహుల్ గాంధీలకు సంబంధించిన చిన్న నాటి ఫోటోలపై తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. సో క్యూట్ అంటూ ఫ్లైయింగ్ కిస్ లు, లవ్ ఎమోజీలు పోస్ట్ చేస్తున్నారు.