రేవంత్ రెడ్డికి గతం గుర్తు చేసిన ఆర్జీవీ!
అవును... అల్లు అర్జున్ – రేవంత్ రెడ్డి అరెస్ట్ లో కామన్ పాయింట్ ఏమిటి అంటూ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆర్జీవీ... వాళ్లిద్దరూ తమ తమ బెడ్ రూమ్స్ ఉన్నప్పుడే అరెస్టు అయ్యారంటు సంచలన పోస్ట్ పెట్టారు!
By: Tupaki Desk | 15 Dec 2024 9:07 AM GMTసంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ అరెస్టవ్వడం.. రిమాండ్, బెయిల్, విడుదల వంటి విషయాలు శనివారం ఉదయంతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అరెస్టుకు సంబంధించిన ప్రకంపనలు మాత్రం ఇంకా తీవ్రంగానే వినిపిస్తున్నాయని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క ఈ వ్యవహారంపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టచ్ చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ క్రమంలో ఇప్పటికే అల్లు అర్జున్ కు తెలంగాణ సర్కార్ రిటన్ గిఫ్ట్ ఇచ్చిందటూ కామెంట్ చేశారు.
ఇందులో భాగంగా... తెలంగాణకు చెందిన అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ మూవీని అందించి.. రాష్ట్రానికి గొప్ప బహుమతిని అందించారు కానీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అల్లు అర్జున్ ను జైలుకు పంపి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. దీంతో... రేవంత్ ను కెలకడం అవసరమా అనే చర్చ తెరపైకి వచ్చింది.
పైగా... తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందితే, ఆమె కుమారుడు ఆస్పత్రిలో సీరియస్ కండిషన్స్ లో ఉంటే స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని.. ఇందులో మరో ఉద్దేశ్యం ఏమీ లేదని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఆర్జీవీ ఇలా స్పందించడం గమనార్హం. ఈ సమయంలో రేవంత్ రెడ్డికి గతం గుర్తు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు ఆర్జీవీ.
అవును... అల్లు అర్జున్ – రేవంత్ రెడ్డి అరెస్ట్ లో కామన్ పాయింట్ ఏమిటి అంటూ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆర్జీవీ... వాళ్లిద్దరూ తమ తమ బెడ్ రూమ్స్ ఉన్నప్పుడే అరెస్టు అయ్యారంటు సంచలన పోస్ట్ పెట్టారు!
కాగా... గతంలో రేవంత్ రెడ్డిని పోలీసులు ఇంటిలోనికి వెళ్లి, బెడ్ రూమ్ లో ఉండగా మరీ అరెస్ట్ చేయగా... తాజాగా తనను అరెస్ట్ చేయడం తప్పు కాదు కానీ మరీ బెడ్ రూమ్ వరకూ వచ్చి అరెస్ట్ చేయడం టూమచ్ అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ మిక్స్ చేసి స్పందించిన ఆర్జీవీ... రేవంత్ కు గతం గుర్తు చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.