Begin typing your search above and press return to search.

20 ఏళ్లు 200 ఎయిర్ పోర్టులు.. 4వేల ఫ్లైట్లు

జాబ్ క్రియేషన్.. ఆర్థిక కార్యకలాపాలు.. వాణిజ్య కేంద్రాలకు ఎయిర్ పోర్టులు కేంద్ర బిందువుగా మారనున్నాయి.

By:  Tupaki Desk   |   25 Oct 2024 4:36 AM GMT
20 ఏళ్లు 200 ఎయిర్ పోర్టులు.. 4వేల ఫ్లైట్లు
X

అంతకంతకూ పెరుగుతున్న విమానయాన రంగం రానున్న 20 ఏళ్లలో మరింతగా దూసుకెళ్లనుంది. గడిచిన కొన్నేళ్లుగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రానున్న 20 ఏళ్లలో విమానయాన రంగం భారీగా విస్తరించనుంది. మరో 200 విమానాశ్రయాలు మాత్రమే కాదు.. 4000 విమానాలు అవసరమవుతాయన్న అంచనాను వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జాబ్ క్రియేషన్.. ఆర్థిక కార్యకలాపాలు.. వాణిజ్య కేంద్రాలకు ఎయిర్ పోర్టులు కేంద్ర బిందువుగా మారనున్నాయి.

రానున్న రోజుల్లో మన దేశంలో విమానాల డిజైన్.. తయారీకి దీర్ఘకాల ప్రణాళికలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం దేశీయ సంస్థల వద్ద 800 విమానాలు ఉన్నాయి. ఇప్పుడున్న డిమాండ్ నేపథ్యంలో దేశీయ సంస్థలు 1200 విమానాల్ని కొనేందుకు సిద్దంగా ఉన్నాయి. గడిచిన పదేళ్లలో విమానాశ్రయాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు 157 ఎయిర్ పోర్టులు ఉండగా.. మరో 20 ఏళ్లలో ఈ సంఖ్య 400లకు చేరుకోనుంది.

గడిచిన ఐదేళ్లలో 50 వరకు ఎయిర్ పోర్టులు ఏర్పాటయ్యాయి. ఐదేళ్లలో వార్షిక విమాన ప్రయాణికుల సంఖ్య 22 కోట్లకు చేరుకోవటం గమనార్హం. రానున్న రోజుల్లో పెరిగే డిమాండ్ తో పోల్చినప్పుడు ఫ్రాన్స్ కు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ బస్ వరకే 5వేల మంది వరకు ప్రత్యక్ష ఉద్యోగులు ఉండనున్నట్లుగా అంచనా వేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఎయిర్ బస్ కు 3500 మంది ఉద్యోగులు ఉన్నారు. రెండేళ్లలో మన దేశం నుంచి 2 బిలియన్ డాలర్ల విలువైన సేవలు.. విడి భాగాల్ని సమీకరించాలని ఎయిర్ బస్ లక్ష్యంగా పెట్టుకోవటం గమనార్హం.పైలెట్లకు రెండో ప్రయోగాత్మక ట్రైనింగ్ కేంద్రాన్ని బెంగళూరులో డెవలప్ చేయనున్నారు. సి295 మిలిటరీ విమానాలు.. హెచ్ 1 హెలీకాఫ్టర్లను ఎయిర్ బస్ భారత్ లోనే తయారు చేయనుంది. దీన్ని టాటా గ్రూప్ తో కలిసి ఉత్పత్తి చేయనున్నారు.