Begin typing your search above and press return to search.

తిరుమ‌ల‌ను కాపాడండి: ప్ర‌ధాని మోడీకి ర‌మ‌ణ దీక్షితులు విన్న‌పాలు

''స‌నాతన ధ‌ర్మంపై విశ్వాసం లేని అధికారులు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కార్య‌క్ర‌మాల‌ను నియంత్రిస్తున్నారు

By:  Tupaki Desk   |   27 Nov 2023 3:25 PM GMT
తిరుమ‌ల‌ను కాపాడండి:  ప్ర‌ధాని మోడీకి ర‌మ‌ణ దీక్షితులు విన్న‌పాలు
X

డాక్ట‌ర్ ఏవీ ర‌మ‌ణ దీక్షితులు. తిరుమ‌ల తిరుప‌ది దేవ‌స్థానం.. మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు. ఓ ఐదేళ్ల కింద‌ట తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో అప‌చారాలు జ‌రుగుతున్నాయ‌ని.. అప్ప‌టి ప్ర‌బుత్వం సంప్ర‌దాయాలు పాటించ‌డం లేద‌ని..గ‌గ్గోలు పెట్టిన ప్ర‌ధాన అర్చ‌కులు. అయితే.. ఇప్పుడు అదే ర‌మ‌ణ దీక్షితులు తాజాగా తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ప్ర‌ధాని మోడీకి ఆయ‌న 'ఎక్స్‌' వేదిక‌గా ఫిర్యాదు చేశారు.

''స‌నాతన ధ‌ర్మంపై విశ్వాసం లేని అధికారులు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కార్య‌క్ర‌మాల‌ను నియంత్రిస్తున్నారు. సంప్ర‌దాయాలు, ధ‌ర్మాలు, నిర్మాణాల‌ను, హిందూ ఆల‌యాల ఆస్తుల‌ను వ్య‌వ‌స్థీకృతంగా నాశ‌నం చేస్తున్నారు'' అని ర‌మ‌ణ దీక్షితులు త‌న పోస్టులో పేర్కొన్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాన్ని ర‌క్షించ‌డంతోపాటు రాష్ట్రాన్ని హిందూ రాష్ట్రంగా తీర్చిదిద్దాల‌ని ఆయ‌న ప్ర‌ధాని మోడీకి విన్న‌వించారు.

"దయచేసి ఆలయాన్ని రక్షించి ఇక్కడ హిందూ రాష్ట్రాన్ని వెంటనే స్థాపించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు" అని టిటిడి ప్రధాన అర్చకుడు అభ్యర్థించారు. ప్ర‌ధాన మంత్రి సోమ‌వారం తిరుమల శ్రీవారిని దర్శించారు. ఈ నేప‌థ్యంలో దీక్షితులు కూడా ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌లో ఉండాల‌ని అనుకున్నారు. అయితే.. టీటీడీ అధికారులు ఆయ‌న‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో అసంతృప్తిని వ్యక్తం చేసిన దీక్షితులు మోడీకి ఈ సందేశాన్ని పంపించ‌డం గ‌మ‌నార్హం.

గతంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ నెల ప్రారంభంలో, రమణ దీక్షితులు వంశపారంపర్య అర్చకుల హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మరో ట్వీట్‌ను పోస్ట్ చేశారు. అక్రమంగా పదవీ విరమణ పొందిన వంశపారంపర్య అర్చకులకు హామీ ఇచ్చిన హోదాను అమలు చేసేలా టిటిడిని ఆదేశించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు,