ప్రియాంకా గాంధీ బుగ్గలు అంటూ బీజేపీ నేత !
లేటెస్ట్ గా బీజేపీ నేత ఒకరు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు వయనాడ్ ఎంపీ అయిన ప్రియాంకా గాంధీ మీద అనుచితమైన వ్యాఖ్యలే చేశారు.
By: Tupaki Desk | 6 Jan 2025 4:23 AM GMTరాజకీయాల్లో సంచలనం కోసం మాట్లాడుతున్నారా లేక ప్రజల యొక్క అటెన్షన్ గెయిన్ చేయడానికి ట్రిక్స్ ఉపయోగిస్తున్నారా అన్నది తెలియదు కానీ కొంత మంది నేతలు తమ వాచాలత్వాన్ని చూపిస్తూ చపలచిత్తాన్ని చాటుకుంటూ ఉన్నారు. లేటెస్ట్ గా బీజేపీ నేత ఒకరు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు వయనాడ్ ఎంపీ అయిన ప్రియాంకా గాంధీ మీద అనుచితమైన వ్యాఖ్యలే చేశారు.
రమేష్ బిధూరీ అనే ఆయన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన అనవసరంగా ప్రియాంకా గాంధీ ప్రస్తావనను తీసుకుని వచ్చారు. తాను గెలిస్తే తన నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల మాదిరిగా నున్నగా చక్కంగా స్మూత్ గా చేస్తాను అని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన సెటైరికల్ గా చేసినట్లుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
అలా ఇది ఇపుడు వివాదంగా మారింది. కాంగ్రెస్ నేతలు అయితే సదరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ప్రియాంకా గాంధీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా దీని మీద విమర్శలు చేశారు. మహిళల పట్ల బీజేపీ వైఖరి ఇది అని ఆయన దుయ్యబెట్టారు.
అయితే తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి ఉందని రమేష్ బిధూరీ అంటున్నారు. పైగా గట్టిగా సమర్ధించుకుంటున్నారు. గతంలో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ లో రోడ్లను ప్రఖ్యాత సినీ నటి హేమామాలిని బుగ్గలతో పోల్చి ఆ విధంగా నున్నగా చేస్తాను అని జనాలకు చెప్పలేదా అని ప్రశ్నిస్తున్నారు.
లాలూ వ్యాఖ్యలు కరెక్ట్ అయితే తన వ్యాఖ్యలు కరెక్ట్ అని ఆయన అంటున్నారు. హేమమాలిని ప్రియాంకా గాంధీ కంటే ప్రఖ్యాతి చెందిన వారని ఆమె ప్రముఖ నటి అంతే కాదు రాజకీయ నేత ఎంపీ అని ఆయన అన్నారు. మరి లాలూ చేత ఎందుకు క్షమాపణలు కోరలేదని లాజిక్ పాయింట్ ని ఆయన తీస్తున్న్నారు.
అయితే ఎపుడో దశాబ్ద కాల క్రితం ఆ ఇష్యూ జరిగింది. ఇపుడు వేడిగా వాడిగా ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రమేష్ బిధూరీ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో అంతా మండిపడుతున్నారు. ఆయన క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని డిమాండ్ రావడంతో బీజేపీ ఇరకాటంలో పడింది.
ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి గెలిచి సత్తా చాటాలని సర్వ శక్తులూ ఒడ్డుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతల నుంచే ఈ రకమైన వివాదాస్పద ప్రకటనలతో ఇబ్బందులు రావడం పట్ల కలవరపడుతోంది. మొత్తానికి చూస్తే రమేష్ బిధూరి చేత క్షమాపణలు చెప్పించకపోతే అది ఏకంగా మహిళా ఓట్లను బీజేపీకి దూరం చేసేలా ఉందని కూడా కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఆప్ కి అనవసరంగా చాన్స్ ఇచ్చినట్లుగా ఉంటుందని కూడా బెంగటిల్లుతోంది. మరి రమేష్ బిధూరీ క్షమాపణలు చెబుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.