Begin typing your search above and press return to search.

సీబీఎన్ ని సమర్ధిస్తున్నారా... ఈ 12 ప్రశ్నలకూ సమాధానం చెప్పండి!

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాడ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Sep 2023 11:12 AM GMT
సీబీఎన్ ని సమర్ధిస్తున్నారా... ఈ 12 ప్రశ్నలకూ సమాధానం చెప్పండి!
X

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాడ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబుకి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ఈ సమయంలో పవన్ కల్యాణ్ కి తొమ్మిది ప్రశ్నలు సంధించి.. ప్రతీ దానికి సింగిల్ వర్డ్ లో ఆన్సర్ చెప్పమని మూడు నాలుగు రోజుల క్రితం ట్వీట్ చేసిన సినిమా దర్శకుడు రాం గోపాల్ వర్మ... తాజాగా మరో 12 ప్రశ్నలు సంధించారు. చంద్రబాబుని సమర్ధించే వాళ్ళెవరైనా ఈ 12 ప్రశ్నలకి వన్ వర్డ్ లో "ఆవునా? కాదా?" అనే ఫార్మాట్ లో సమాదానమిస్తారా? అని ప్రశ్నించారు.

అవును... ఈ నెల 11 న గౌరవనీయులైన శ్రీ పవన్ కల్యాణ్ గారూ, నా ఈ క్రింది తొమ్మిది ప్రశ్నలకు కేవలం వన్ వర్డ్ ఆన్సర్లు ఇవ్వగలరని నా రిక్వెస్ట్" అంటూ ట్వీట్ చేసి అందులో తొమ్మిదో ప్రశ్నగా... "అసలు స్కిల్ స్కాం కేసు మీకేమర్ధమయ్యిందో, దానిలోని తప్పులెంటో ఒక వీడియోలో కెమెరా వంక చూస్తూ వివరించగలరా?" అని ప్రశ్నించిన ఆర్జీవీ... తాజాగా మరో 12 ప్రశ్నలు సంధించారు.

ఇందులో భాగంగా... "చంద్రబాబుని సమర్ధించే వాళ్ళెవరైనా ఈ 12 క్వశ్చన్స్ కి వన్ వర్డ్ లో "ఆవునా? కాదా?" అనే ఫార్మాట్ లో సమాధానమిస్తారా?" అని ప్రశ్నించారు.

1) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై చేసుకున్న ఒప్పందం బోగస్... అవునా?

2) ఈ ఫేక్‌ ఒప్పందంతోనే రూ.300 కోట్లు పైగా ఇచ్చేశారు... అవునా?

3) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఈ డబ్బు విడుదల చేయడానికి అన్ని రూల్స్‌ ను ఉల్లంఘించారు. డబ్బు విడుదలకోసం అధికారుల అబ్జెక్షషన్స్ పెడచెవిన పెట్టారు... అవునా?

4) తమకు ఎలాంటి డబ్బు ముట్టలేదని, అసలు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని.. సీమెన్స్‌ కంపెనీ లిఖిత పూర్వకంగా చెప్పింది... అవునా?

5) 90శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇచ్చే ఎలాంటి స్కీం తమ వద్దలేదని సీమెన్స్‌ చెప్పింది... అవునా?

6) ఈమేరకు సెక్షన్‌ 164 సి.ఆర్.పీ.సీ. కింద జడ్జి ఎదుట ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాధికారులు, సీమెన్స్‌ అధికారులు స్టేట్‌ మెంట్లు ఇచ్చారు... అవునా?

7) విడుదల చేసిన ఆ డబ్బు ఎక్కడికి పోయిందో తెలుసుకోవాల్సిన భాద్యత ప్రభుత్వానికి ఉంది... అవునా?

8) ఆ డబ్బును ఎవరు తీసుకున్నారో కనిపెట్టాల్సిన భాద్యత ప్రభుత్వానికి ఉంది... అవునా?

9) రూ.300 కోట్లకుపైగా డబ్బును షెల్‌ కంపెనీల ద్వారా, మధ్యవర్తుల ద్వారా మళ్లించారు... అవునా?

10) స్కిల్‌ కేసులో ఈడీ దర్యాప్తుచేసి నలుగురిని అరెస్టుచేసి ఆ విషయాన్ని ఈడీ తన అక్కౌంట్‌ ద్వారా ట్వీట్‌ చేసింది. అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు మీ అభియోగం సెంట్రల్ ఏజెన్సీ అయిన ఈడీ ఈ విషయంలో రాజకీయ ప్రతీకారానికి దిగిందని అంటున్నారు... అవునా?

11) విజయవాడలోని ఏసీబీ కోర్టు దాదాపు 10 గంటలసేపు ఇరుపక్షాల వాదనలు విని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించే చంద్రబాబుకు రిమాండ్‌ విధించింది... అవునా?

12) ఇళ్ల నిర్మాణం విషయంలో డబ్బు చంద్రబాబుగారి చేతిలోకి వెళ్లిందనే విషయాన్ని ఐటీ నోటీసుల ద్వారా ఎలా వెలుగులోకి వచ్చిందో, అలాగే.. స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంలో అనేక షెల్‌ కంపెనీలు, నిందితులైన యోగేష్‌ గుప్తా, మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని తదితరుల ద్వారా ఆయన మాజీ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్‌ కు, అక్కడ నుంచి ఆయనకు చేరిందని ఈడీ చెప్తోంది... అవునా?

ఒక వేళ కాదంటే పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పారిపోయినట్టు? అని వరుసగా డజను ప్రశ్నలు సంధించిన రాం గోపాల్ వర్మ... "ఈ 12 ప్రశ్నలకు స్పందించకపోతే అన్ని ప్రశ్నలకి అవునని సమాధానమిచినట్టే" అని ముగించడం గమనార్హం!