Begin typing your search above and press return to search.

లోక్ సభలో రామ్మోహన్ నాయుడు, అప్పలనాయుడు ప్రత్యేకత ఇదే!

ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా... వీరిద్దరూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 9:43 AM GMT
లోక్  సభలో రామ్మోహన్  నాయుడు, అప్పలనాయుడు ప్రత్యేకత ఇదే!
X

18వ లోక్ సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా ఎన్నికైన లోక్ సభ సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా... వీరిద్దరూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో తొలిరోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం మొదలవుతుంది.

దీంతో మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదే క్రమంలో ఈ నెల 26న స్పీకర్ ఎన్నికా పూర్తవుతుంది. అనంతరం 27న రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. అదే రోజు ఉభయ సభలనూ ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. మరోపక్క సభ ప్రారంభం కాగానే కేరళలోని వయనాడ్ స్థానానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు.

పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లిన టీడీపీ ఎంపీ!:

ఈ రోజు లోక్ సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఢిల్లీలో లోక్ సభకు సైకిల్ పై వెళ్లారు. ఢిల్లీలోని తాను నివాసం అంటున్న అతిథి గృహం నుంచి సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంటుకు వెళ్లారు. ఈ క్రమంలో ముందుగా తన తల్లికి పాదాభివందనం చేసిన అప్పలనాయుడు.. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వచ్చారు. ఈ సమయంలో తెలుగు సంప్రదాయమైన పంచెకట్టులో కనిపించారు.

కాగా... కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీలో పలు కమిటీల్లో పనిచేశారు. అయితే అనూహ్యంగా 2024 ఎన్నికల్లో ఆయనకు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో ఆయన సుమారు రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.