Begin typing your search above and press return to search.

రామోజీ రాసిన వినూత్న వీలునామా.. ఉద్యోగుల‌ను ఉద్దేశించి!

లేఅవుట్ ఆర్టిస్టుగా ప్ర‌స్థానం ప్రారంభించిన వారు.. త‌ర్వాత కాలంలో దేశంలోనే నెంబ‌ర్ 1 కార్టూనిస్టుగా ఎదిగారు.

By:  Tupaki Desk   |   9 Jun 2024 12:41 PM GMT
రామోజీ రాసిన వినూత్న వీలునామా.. ఉద్యోగుల‌ను ఉద్దేశించి!
X

ఈనాడు అధిప‌తి, రామోజీ ఫిల్మ్ సిటీ రూప‌కర్త‌.. రామోజీరావు.. త‌న సంస్థ‌ల ఉద్యోగుల‌ను ఉద్దేశించి వినూ త్న రీతిలో బాధ్య‌త‌ల వీలునామా రాసుకొచ్చారు. స‌హ‌జంగా ఏ సంస్థ‌లో అయినా.. ఉద్యోగులు ఉంటారు. కానీ, వారి పాత్ర కొంత వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం. అంత‌కుమించి ఉన్నా..ఒక‌రిద్ద‌రికి మాత్ర‌మే ఉంటుంది. కానీ, రామోజీ గ్రూపు సంస్థ‌ల్లో ఈనాడు మొద‌లుకుని.. మార్గ‌ద‌ర్శి వ‌ర‌కు.. అనేక మంది చిన్న స్థాయిలో సంస్థ‌ల్లో చేరి, అగ్ర పీఠాలు అందుకున్న వారు ఉన్నారు.

లేఅవుట్ ఆర్టిస్టుగా ప్ర‌స్థానం ప్రారంభించిన వారు.. త‌ర్వాత కాలంలో దేశంలోనే నెంబ‌ర్ 1 కార్టూనిస్టుగా ఎదిగారు. ఇక‌, మార్గ‌ద‌ర్శిలోనూ చందాలు క‌ట్టించే ఏజెంట్లు గా చేరిన వారు.. శాఖాధిప‌తులుగా ఎదిగారు. ఇలా.. అన్ని సంస్థ‌ల్లోనూ అనేక మంది ఉన్న‌త‌స్థాయి ఉద్యోగులుగా అభివృద్ధి చెందారు. దీనికి కార‌ణం.. రామోజీ చూపించిన‌.. మార్గంలో క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ముందుకు న‌డ‌వ‌డ‌మే! ఇదే వారికి క‌లిసి వ‌చ్చింది. అయితే.. చివ‌రి ద‌శ‌లో ఆయ‌న వారికి అమూల్య‌మైన వీలునామా రాశారు.

సంస్థ‌కు అధిప‌తిగా.. ఆయ‌న వారికి ఇచ్చిన ఆస్తి.. పంచిన ఆస్తి.. క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత భావం. ఈనాడు లేదా.. మార్గ‌ద‌ర్శి లేదా.. రామోజీ గ్రూపు సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు ఎన‌లేని గుర్తింపు తీసుకువ‌చ్చిం ది.. ఇవే. ఇదే విష‌యాన్ని త‌న చివరి ప‌లుకుల్లో రామోజీరావు ప్ర‌స్తావించారు. ప్ర‌తి ఉద్యోగికీ సహ‌జ సిద్ధం గా అల‌వ‌డి న క్ర‌మ‌క్ష‌ణ‌, స‌మ‌య పాల‌న వింటివి కొన‌సాగించాల‌ని.. తాను లేక‌పోయినా.. త‌న స్పూర్తి... ప‌రిఢ‌విల్లేలా ప‌నిచేయాల‌ని ఆయ‌న కోరారు. ద‌శాబ్దాలుగా త‌న వెంటే న‌డిచిన సిబ్బందికి ఆయ‌న ధ‌న్య వాదాలు తెలిపారు.

ఇక‌, సంస్థ‌ల పురోగ‌తి,భ‌విష్య‌త్తు అంతా న‌మ్మ‌కం, విశ్వ‌స‌నీయ‌త‌పైనే ఉంద‌న్న రామోజీరావు.. వీటిని నిల‌బెట్టాల్సిన బాధ్య‌త‌.. ఉద్యోగుల‌దేన‌న్నారు. ఇన్నేళ్లుగా ఎలా అయితే.. అప్ర‌తిహ‌త విజ‌యంలో భాగ స్వాములుగా ఉన్నారో.. ఇప్పుడు కూడా.. మ‌రింత ఒద్దిక‌గా ముందుకు సాగాల‌ని.. సంస్థ‌ను విజ‌య తీరం దిశ‌గా అడుగులు వేయించాల‌ని రామోజీ సూచించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న సంస్థ‌ల ఉద్యోగుల‌కు బాధ్య‌త‌ల‌ను గుర్తు చేస్తూ.. మ‌రువ‌రాదని హెచ్చ‌రిస్తూ.. బాధ్య‌త‌ల వీలునామాను రాశారు.