Begin typing your search above and press return to search.

రంజుగా బెజవాడ రాజకీయం...రంగంలోకి నందమూరి కుటుంబం...!?

విజయవాడ టీడీపీ రాజకీయాన్ని కకావికలు చేసిన వైసీపీ పై చేయి సాధించింది.

By:  Tupaki Desk   |   16 Jan 2024 8:46 PM GMT
రంజుగా బెజవాడ రాజకీయం...రంగంలోకి నందమూరి కుటుంబం...!?
X

బెజవాడ అంటేనే ఒక రేంజిలో పొలిటికల్ హీట్ ఉంటుంది. రాజకీయ రాజధానిగా పేరు. బెజవాడ రాజకీయం ఆది నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటూ వస్తోంది. టీడీపీ పెట్టాక ఎపుడూ పడని ఇబ్బందులు అన్నీ వైసీపీ 2019లో గెలిచిన సందర్భంగా వచ్చాయి. విజయవాడ టీడీపీ రాజకీయాన్ని కకావికలు చేసిన వైసీపీ పై చేయి సాధించింది.

ఇక చూస్తే 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటుని మాత్రం టీడీపీ గెలుచుకుంది ఆ తరువాత అన్నీ పరాజయాలే. ఇక నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూడా వైసీపీ జెండా ఎగరేసింది. ఈ నేపధ్యంలో రాజకీయ గాలి మారి టీడీపీకి అనుకూలం అయింది అనుకునే నేపధ్యంలో కేశినేని నాని వైసీపీలో చేరిపోయారు 2019లో కేశినేని నాని రెండవసారి గెలుపు వెనక ఆయన సొంత ఇమేజ్ కూడా ఉందని అంటారు.

దాంతో ఆయన అధికార పార్టీలో చేరి టీడీపీకి సవాల్ చేస్తున్నారు. ఇక టీడీపీ అధినాయకత్వం కేశినేని నాని విషయనని సీరియస్ గానే తీసుకుంటోంది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని నాని ఉవ్విళ్ళూరుతూంటే ఆయన అసలు గెలవకూడదు అన్నది టీడీపీ హై కమాండ్ పంతంగా ఉంది అని అంటున్నారు.

ఇక విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా ఇప్పటిదాకా కేశినేని నాని తమ్ముడు చిన్ని పేరు వినిపించింది. కానీ ఇపుడు కొత్త పేరు తెర మీదకు వస్తోంది. ఎన్టీయార్ మనవరాలు హరికృష్ణ కుమార్తె అయిన నందమూరి సుహాసినిని విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అన్నది టీడీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది అని అంటున్నారు.

నందమూరి సుహాసిని 2018లో తెలంగాణాలో కూకట్ పల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆమె రాజకీయంగా చురుకుగా ఉంటున్నారు. టీడీపీతో కలసి ముందుకు సాగుతున్నారు. దాంతో ఆమెను ముందు పెట్టి రాజకీయం చేయాలని టీడీపీ డిసైడ్ అయింది అని అంటున్నారు. నందమూరి ఫ్యామిలీ పైగా మహిళా ఈ ఈక్వేషన్స్ తో కేశినేని నానిని ఢీ కొట్టి మరోసారి బెజవాడలో ఎంపీ సీటుని కైవశం చేసుకోవాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు.

ఒక విధంగా చూస్తే ఇది టీడీపీ భారీ వ్యూహం అనే చెప్పాలి. ఎంపీ సీటు గెలుచుకుంటే ఆ పరిధిలోని ఎమ్మెల్యే సీట్లు కూడా దక్కుతాయి. బెజవాడలో టీడీపీ పట్టు నిలుస్తుంది ఏపీలో అధికారం దక్కుతుంది. ఇలా చాలా రకాలుగా ఆలోచించిన మీదటనే సుహాసిని పేరుని ఇపుడు తెర మీదకు తెస్తున్నారు అని అంటున్నారు. కేశినేని నాని అయితే టీడీపీని వీక్ చేసి పారేస్తాను అని పట్టుదలగా ఉన్నారు. సో ఇపుడు బెజవాడలో రంజు అయిన రాజకీయానికి తెర లేస్తోంది అన్న మాట.