Begin typing your search above and press return to search.

విచారణ వేళ మాటలతో హింసిస్తున్నారు.. కోర్టులో రన్యారావు కన్నీళ్లు

దుబాయ్ నుంచి వస్తూ.. దొంగచాటుగా పద్నాలుగు కేజీల బంగారాన్ని తనతో తీసుకొస్తూ అడ్డంగా దొరికిపోయిన సినీ ని రన్యారావు ఉదంతం తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 March 2025 10:29 AM IST
విచారణ వేళ మాటలతో హింసిస్తున్నారు.. కోర్టులో రన్యారావు కన్నీళ్లు
X

దుబాయ్ నుంచి వస్తూ.. దొంగచాటుగా పద్నాలుగు కేజీల బంగారాన్ని తనతో తీసుకొస్తూ అడ్డంగా దొరికిపోయిన సినీ ని రన్యారావు ఉదంతం తెలిసిందే. పెను సంచనలంగా మారిన ఈ ఉదంతం నేపథ్యంలో ప్రస్తుతం ఆమె డీఆర్ఐ కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఆమెకు చెందిన ఒక ఫోటో వైరల్ గా మారటం తెలిసిందే. కళ్ల కింద గాయమైనట్లుగా.. ముఖం ఉబ్బి ఉన్న ఫోటో విడుదలతో.. ఆమెను శారీరకంగా హింసిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో బెంగళూరు సెషన్స్ కోర్టులో ఆమెను హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఆమెను న్యాయమూర్తి ప్రశ్నిస్తూ.. కస్టడీలో ఏమైనా భౌతిక దాడులు జరిగాయా? అని అడగ్గా.. తనను శారీరకంగా ఏమీ ఇబ్బందులకు గురి చేయటం లేదని.. మాటలతో హింసిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా కన్నీటిపర్యంతమయ్యారు.

అయితే.. ఆమెను మానసికంగా హింసిస్తున్నారన్న మాటల్లో నిజం లేదని.. ఆమె వాదన తప్పని డీఆర్ఐ ఖండించింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని.. రూల్ ప్రకారమే ఆమెను ప్రశ్నిస్తున్నట్లుగా పేర్కొంది. కళ్ల కింద గాయాలున్న ఫోటో విడుదల నేపథ్యంలో కర్ణాటక మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు ఆమెపై దాడికి పాల్పడ్డారా? అన్న ప్రశ్నను మహిళా కమిషన్ ఛైర్మన్ నాగలక్ష్మీ చౌదరి లేవనెత్తారు.

తమకు నేరుగా ఈ అంశంపై దర్యాప్తు చేసే అవకాశం లేదని.. రన్యారావు తమకు కంప్లైంట్ చేస్తే.. ఆమెకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తమకు లేఖ రూపంలో కంప్లైంట్ చేస్తే సరిపోతుందన్నారు. అదే జరిగితే అన్ని విభాగాల్ని అప్రమత్తం చేయటంతో పాటు..సరైన రీతిలో దర్యాప్తు చేసి రిపోర్టు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆమె ఏమైనా దాడికి గురైందా? అన్నది ఆమె కంప్లైంట్ రూపంలో ఇస్తేనే తాము ఏమైనా చేయగలమన్న నాగలక్ష్మీ.. తమను సంప్రదించకపోతే.. ఈ అంశంపైన తాము కనీసం మాట్లాడలేమని పేర్కొన్నారు. మరి.. కస్టడీలో తనకు ఎదురవుతున్న పరిస్థితుల గురించి మహిళా కమిషన్ కు రన్యారావు లేఖ రాస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.