ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు ఒక ప్రత్యేకత.. 823 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందంట
అటువంటి అత్యంత అరుదైన నెలను ఈ ఏడాది ఫిబ్రవరిలో చూడబోతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
By: Tupaki Desk | 9 Jan 2025 4:30 PM GMTతొమ్మిది రోజుల క్రితమే కొత్త సంవత్సరం ప్రారంభమైంది. పాత క్యాలెండర్లు పోయి కొత్త క్యాలెండర్లు వచ్చాయి. అయితే.. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కో నెల ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. సరిగా ఈ ఏడాది కూడా ఫిబ్రవరి నెల అలాంటి ప్రత్యేకతను పొందింది. ఈ ఏడాది వస్తున్న ఫిబ్రవరి నెల 823 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందంట.
2025 ఫిబ్రవరి నెలకు ఒక ప్రత్యేకత ఉందని గణిత శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 823 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుందని.. అటువంటి అత్యంత అరుదైన నెలను ఈ ఏడాది ఫిబ్రవరిలో చూడబోతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఆ ప్రత్యేకత ఏమిటంటే.. నెలలో ఒక్కోరోజు నాలుగేసి సార్లు రానున్నాయి. సాధారణంగా ఇలా జరగదని అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
176 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే అరుదైన నెలను ఫిబ్రవరిలోనే చూడబోతున్నట్లు గణిత శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నాడు. ఫిబ్రవరిలో సోమ, శుక్ర, శనివారాలు మూడేసి రోజులు మాత్రమే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అన్ని రోజులు నాలుగేసి చొప్పున రావడం అత్యంత అరుదుగా జరుగుతుంటుంది. సాధారణ నెలల్లో అయితే ఒక్కో రోజు 5 సార్లు, కొన్ని మూడు, కొన్ని నాలుగు సార్లు వస్తూ ఉంటాయి. కానీ వచ్చే ఫిబ్రవరి నెలలో మాత్రం అన్ని రోజులు నాలుగేసి సార్లు రావడం గమనార్హం.
సోమవారం నాలుగు సార్లు, మంగళవారం నాలుగు సార్లు, బుధవారం నాలుగు సార్లు, గురువారం నాలుగుసార్లు, శుక్రవారం నాలుగు సార్లు, శనివారం నాలుగు సార్లు, ఆదివారం నాలుగు సార్లు చొప్పున వస్తోంది. మొత్తంగా 28 రోజులకు ఏడు వారాలు నాలుగుసార్లు చొప్పున వస్తున్నాయి. ఇటువంటి అరుదైన నెలలను రెండోసారి చూసే వాళ్లు ఉండరని చెబుతున్నారు. గతంలో ఎప్పుడో 823 ఏళ్ల కిందట ఇటువంటి నెలను చూశారని.. మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో చూడబోతున్నారని చెబుతున్నారు. దీనికి గల కారణాలు తెలియవు అని గణిత నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఏడు రోజులు నాలుగు సార్లు చొప్పున రావడం అంటే అసాధారణమైన సందర్భంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఫిబ్రవరి నెలకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. వివిధ ప్రాంతాలకు చెందిన నిపుణులు ఈ నెలకు సంబంధించిన రోజులు గురించి వివరిస్తూ వీడియోలు చేస్తూ పోస్ట్ పెడుతున్నారు. ఆ వీడియోలను ఆసక్తిగా చూస్తున్న వీక్షకులు సంఖ్య పెరిగింది. ఈ నెలకు ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసుకునే ఉద్దేశంతో చాలామంది ఆ వీడియోలను ఓపెన్ చేస్తున్నారు. ఇటువంటి వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పదుల సంఖ్యలో ఉన్నాయి. ఒక్కో వీడియోలను భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వాటికి గల కారణాలను పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు.