Begin typing your search above and press return to search.

రతన్ టాటా మళ్లీ బతికి వస్తే.. వైరల్ గా పొట్టి వీడియో

భారతీయుల నమ్మకం తిరిగి రాని లోకాలకు పయనమైన వైనాన్ని యావత్ భారతం ఆవేదనతో అంగీకరించాల్సి వచ్చింది.

By:  Tupaki Desk   |   13 Oct 2024 4:32 AM GMT
రతన్ టాటా మళ్లీ బతికి వస్తే.. వైరల్ గా పొట్టి వీడియో
X

భారతీయుల నమ్మకం తిరిగి రాని లోకాలకు పయనమైన వైనాన్ని యావత్ భారతం ఆవేదనతో అంగీకరించాల్సి వచ్చింది. రతన్ టాటా ఆస్తమయం కోట్లాది మంది భారతీయులకు వేదనకు గురి చేసింది. ప్రజల మనసుల్లో ఆయనకున్న గౌరవాభిమానం ఏమిటన్న విషయం సోషల్ మీడియా.. వాట్సాప్.. యూట్యూబ్ లలో స్పష్టమైంది. ఆయన లేని చేదు వాస్తవాన్ని అంగీకరించేందుకు మనసు అంగీకరించని వేళలో.. అలాంటి మానవతావాది.. అనుక్షణం దేశ శ్రేయస్సు కోసం తపించే రతన్ టాటా మళ్లీ తిరిగి వస్తే ఎంత బాగుండన్న భావన కలుగటం ఖాయం.

అలాంటి ఫీలింగ్ అందరికి ఉన్నా.. ఒకరు మాత్రం తన మనసులోని భావాల్ని ఏఐ సాయంలో ఒక పొట్టి వీడియో పోస్టు చేశాడు. ఈ 30 సెకన్ల నిడివి ఉన్న వీడియోచూసినంతనే.. ఒకలాంటి రిలీఫ్ కలగటం ఖాయం. తన సారథ్యంలోని టాటా గ్రూపులోని వివిధ సంస్థలకు సంబంధించిన మినియేచర్స్ ను పట్టుకొని ఉండే రతన్ టాటా వీడియో అందరిని ఆకర్షిస్తోంది.

రతన్ టాటా దూరమయ్యారన్న వేదనతో ఉన్న దేశ ప్రజలకు ఈ వీడియో కాస్తంత ఊరట కలిగించటమే కాదు.. ఆయన గురుతులుగా ఎన్నో కంపెనీల్ని ప్రజలకు వదిలి వెళ్లారన్న విషయాన్ని ఈ వీడియో చెప్పకనే చెప్పేస్తుంది. చింతించాల్సిన అవసరం లేదు.. నేను లేకున్నా నా గురుతులు మీతోనే ఉంటాయన్న భావన కలిగేలా ఈ వీడియో ఉందని చెప్పాలి. ఆయన డెవలప్ చేసిన ఎన్నో వ్యాపారాలు ఈ పొట్టి వీడియోలో ఏఐ సాయంతో రూపొందించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేయండి.