Begin typing your search above and press return to search.

సాధారణ షార్ట్, బనియన్ ధరించిన రతన్ టాటాని చూసి షాక్..!

అవును... రతన్ టాటా జీవితాన్ని చూసిన ఎవరైనా, ఆయనను పరిశీలించిన ఎవరికైనా... ఆయన చాలా సింపుల్ లైఫ్ గడపడానికే ఇష్టపడతారని అర్ధమైపోతుంటుంది.

By:  Tupaki Desk   |   10 Oct 2024 5:12 AM GMT
సాధారణ షార్ట్, బనియన్  ధరించిన రతన్  టాటాని చూసి షాక్..!
X

ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ గ్రహీత, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్, ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుడైన పారిశ్రామికవేత్త, భారత పారిశ్రామిక రంగానికి టైటాన్... ఈ స్థాయి మనిషి జీవనశైలి ఎలా ఉంటుందని సాధారణంగా చాలా మంది భావిస్తుంటారు? అంటే... ఠక్కున వచ్చే సమాధానం... అది వేరే లెవెల్ అని!

కానీ.. ఆయన పేరు రతన్ టాటా! లక్షల కోట్లున్నప్పటికీ రతన్ టాటా చాలా సాధారణ జీవితాన్నే గడపడానికి ఇష్టపడుతారు. నానో కారు మార్కెట్ లోకి వచ్చినప్పటి నుంచీ దాన్ని వాడటానికే ఎక్కువగా ఇష్టపడేవారట. ఈ సమయంలో... రతన్ టాటా సింప్లిసిటీ చూసి షాకైన అనుభవం టీవీ బిగించే ఓ టెక్నీషియన్ ఎదురైంది.

అవును... రతన్ టాటా జీవితాన్ని చూసిన ఎవరైనా, ఆయనను పరిశీలించిన ఎవరికైనా... ఆయన చాలా సింపుల్ లైఫ్ గడపడానికే ఇష్టపడతారని అర్ధమైపోతుంటుంది. భారీ కాన్వాయ్ లు, చుట్టూ గన్ మెన్ లు, 30 అంతస్తుల భవనం, ప్రపంచంలోనే బెస్ట్ హై సెక్యూర్డ్ వెహికల్... ఇలాంటివి ఏమీ లేకుండా రతన్ టాటా జీవించారని చెబుతారు!

ఈ క్రమంలో ఒక రోజు ఎల్.ఈ.డీ. టీవీ బిగించటానికి రతన్ టాటా ఇంటికి వెళ్లారు ఓ టెక్నీషియన్. ఆ సమయంలో కాలింగ్ బెల్ కొడితే ఓ వ్యక్తి సాధారణ షార్ట్ ధరించి, పైన ఒక బనీనుతో వచ్చి తలుపు తీశారట. ఈ సమయంలో ఆయన ఎవరో, ఇంట్లో పని చేసేవారేమో అనుకుని చూసిన టెక్నీషియన్ కు ఒక్కసారిగా షాక్ తగిలిందంట.

సాధారణ షార్ట్, పైన బనీను ధరించి టెక్నీషియన్ వస్తే తలుపు తీసింది స్వయంగా రతన్ టాటా. ఎంతోమంది సంపన్నుల ఇళ్లకు వెళ్లి, వాళ్ల వైభోగాన్ను చీసిన సదరు టెక్నీషియన్... రతన్ టాటా సింప్లిసిటీ చూసి షాక్ అయ్యాడంట. ఇక టీవీ బిగించాల్సిన రూమ్మ్ లోకి తీసుకెళ్లగా.. ఆ గది సైతం ఎంతో సాధాసీదాగా ఉందట.

ఇక అతడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల టీవీ. దీంతో... ఓ మనిషి ఇంత సంపద పెట్టుకుని కూడా ఇంత సింపుల్ గా లైఫ్ ఎలా లీడ్ చేయగలుగుతున్నారని ఆశ్చర్యపోయారంట. తత్వం తెలిసిన వ్యక్తికి ఆడంబరాలతో పనిలేదని అంటారు అందుకేనేమో!!