Begin typing your search above and press return to search.

రతన్ టాటా లవ్ స్టోరీ గురించి తెలుసా?

ఇందులో భాగంగా ఆయన బాల్యం, విద్యాభ్యాసం, కెరీర్, దాతృత్వంతో పాటు లవ్ (ఫెయిల్యూర్) స్టోరీ కూడా మరోసారి చర్చకు వచ్చింది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 8:30 PM GMT
రతన్  టాటా లవ్  స్టోరీ గురించి తెలుసా?
X

భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, వ్యాపారవేత్త "రతన్ టాటా" గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. గొప్ప గొప్ప ఆలోచనలతో ఎన్నో కంపెనీలు స్థాపించి సక్సెస్ అయిన విలువలు కలిగిన వ్యాపారవేత్త, దేశాభివృద్ధిలో తన పాత్ర ఉండాలని నిత్యం తపించే మనీషి రతన్ టాటా ఆరోగ్యంపై తాజాగా నెట్టింట చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

బీపీ లెవెల్స్ బాగా పడిపోవడంతో రతన్ టాటా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో... ఆయన ఆరోగ్యంపై రకరకాల కథనాలు మొదలైపోయాయి. ఏకంగా ఆయన ఐసీయూలో చేరినట్లు కథనాలు వెలువడిన పరిస్థితి. దీనిపై స్పందించిన రతన్ టాటా... ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.

తన గురించి ఆలోచించినందుకు చాలా కృతజ్ఞతలు అని మొదలుపెట్టిన ఆయన... తన ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. తాను రెగ్యులర్ మెడికల్ చెకప్ లో భాగంగా ఆస్పత్రికి వెళ్లాలని.. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.. అవాస్తవ ప్రచారం చేయొద్దని మీడియాను, ప్రజలను కోరారు!

ఈ నేపథ్యంలో 85 ఏళ్ల రతన్ టాటా వ్యక్తిగత జీవితం గురించిన చర్చ మరోసారి నెట్టింట మొదలైంది. ఇందులో భాగంగా ఆయన బాల్యం, విద్యాభ్యాసం, కెరీర్, దాతృత్వంతో పాటు లవ్ (ఫెయిల్యూర్) స్టోరీ కూడా మరోసారి చర్చకు వచ్చింది.

అవును... 1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటాకు.. టాటా గ్రూపు వ్యవస్థాకుడు, జంషెడ్ జీ టాటా.. ముత్తాత అవుతారు. 1948లో రతన్ టాటాకు పదేళ్ల వయసున్నప్పుడే ఆయన పేరెంట్స్ విడిపోవడంతో ఆయన నానమ్మ నవాజ్ బాయి టాటా వద్ద పెరిగారు.

ఈ క్రమంలో 1995లో న్యూయర్క్ లోని రివర్ డేల్ కంట్రీ స్కూల్ నుంచి డిప్లొమా పొందిన రతన్ టాటా 1961లో టాటా గ్రూప్ లో కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ను ప్రారంభించారు.

ఈ క్రమంలోనే అంచలెంచెలుగా ఎదిగి భారతదేశం గర్వించే మనిషి, వ్యాపారవేత్త గా ఎదిగారు! ఇక ఆయన చేసిన ఎన్నో దాతృత్వ కార్యాలయాల్లో 2014లో ఐఐటీ బాంబేకు ఇచ్చిన 95 కోట్ల రూపాయల విరాళం మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే.

అయితే రతన్ టాటా అవివాహితుడిగానే మిగిలిపోయారు. దీని వెనుక ఓ పెద్ద లవ్ స్టోరీనే ఉంది. రతన్ టాటా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఓ యువతితో ప్రేమలో పడ్డారట. త్వరలో పెళ్లి కూడా చేసుకొవాలనుకున్నారు. అయితే... ఆ సమయంలో రతన్ టాటా అమ్మమ్మకు ఆరోగ్యం బాగుండకపోవడంతో ఆయన భారతదేశానికి వెళ్లాల్సి వచ్చింది.

సరిగ్గా అదే సమయంలో భారత్ - చైనా వార్ జరుగుతోంది. దీంతో... రతన్ ప్రేమించిన యువతి భారత్ కు రావడానికి వీలు కలగలేదట. యుద్ధం కారణంగా ఆమెను ఇండియాకు పంపడానికి ఆ యువతి తల్లితండ్రులు ఇష్టపడలేదు. దీంతో... రతన్ టాటా లవ్ స్టోరీ పెళ్లి పీటల వరకూ వెళ్లలేకపోయింది!

అయితే తర్వాత రతన్ టాటా కొన్ని సార్లు పెళ్లి చేసుకొవడానికి ప్రయత్నించినప్పటికీ వర్కవుట్ కాలేదంట. దీంతో... ఆయన సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు!