Begin typing your search above and press return to search.

రతన్ టాటా రత్నాల మాటలు.. అందరికి లైఫ్ లో ఉపయోగపడేవి

భారత పారిశ్రామికవేత్తల్లో ఎవరూ వేలెత్తి చూపేందుకు అవకాశం ఇవ్వని ఆయన వ్యక్తిత్వం.. వ్యాపారదక్షత ఒక ఎత్తు అయితే.. ఆయన సాదాసీదా జీవితం.. ఆయన విజన్ అందరికి ఆదర్శప్రాయం.

By:  Tupaki Desk   |   10 Oct 2024 4:06 AM GMT
రతన్ టాటా రత్నాల మాటలు.. అందరికి లైఫ్ లో ఉపయోగపడేవి
X

వ్యాపారాన్ని విలువలతో చేయటం సాధ్యమేనా? అన్న సందేహానికి సరైన సమాధానంగా రతన్ టాటాను చెప్పొచ్చు. భారత పారిశ్రామికవేత్తల్లో ఎవరూ వేలెత్తి చూపేందుకు అవకాశం ఇవ్వని ఆయన వ్యక్తిత్వం.. వ్యాపారదక్షత ఒక ఎత్తు అయితే.. ఆయన సాదాసీదా జీవితం.. ఆయన విజన్ అందరికి ఆదర్శప్రాయం.

రత్నాల్లాంటి మాటలు రతన్ టాటా అప్పుడప్పుడు చెబుతుంటారు. ఆయన దివికి ఎగిసిన వేళ.. అందరికి ఉపయోగపడే ఆయన చెప్పిన మాటల్లో ముఖ్యమైనవి.. జీవితాన్ని మలుపు తిప్పే వీలున్న విలువైన వ్యాఖ్యల్ని ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమని చెప్పేవారంటే..

- జీవితంలో విజయం సాధించాలంటే ఒడిదొడుకులు ఉండటం చాలా ముఖ్యం. ఈసీజీలో సరళరేఖ ఉన్నదంటే ప్రాణం లేదనే అర్థం’

- తన కోసం పని చేస్తున్న వారి మేలుకోరే వాడే ఉత్తమ నాయకుడు

- కేవలం భౌతిక విషయాలతోనే జీవితం ముడిపడి లేదనే ప్రతివాళ్లూ ఎప్పుడో ఒకప్పుడు గ్రహిస్తారు.. మనం ప్రేమించే వారిని ఆనందంగా ఉంచటంలోనే మన సంతోషమూ ఉందని.

- వృత్తిని జీవితాన్ని సమతులం చేయటంపై నాకు నమ్మకం లేదు. వృత్తిని జీవితాన్ని మమేకం చేయాలి. మీ వృత్తిని.. జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకోవాలి.

- ఎన్ని కష్టాలనైనా పట్టుదలతో ఎదుర్కోండి. అవే మీ విజయానికి పునాది రాళ్లు.

- ఏ ఇబ్బందినీ స్వీకరించకపోవటమే అతి పెద్ద ప్రమాదం. అతి వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఏ సవాలును స్వీకరించలేకపోతే అపజయం తప్పదు.

- ఎదుటివాళ్ల దయాగుణాన్ని.. ప్రేమను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయకండి.

- మీ జీవితం సాఫీగా ఉండకపోవచ్చు. సమాజంలోని సమస్యలను పరిష్కరించలేకపోవచ్చు. అలా అని సమాజంలో మీ ప్రాముఖ్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. ధైర్యం.. నమ్మకం మనకో దారి చూపిస్తాయి.

- అవకాశాల కోసం ఎదురుచూడకూడదు. అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి.

- నాయకత్వం అంటే బాధ్యత తీసుకోవటం.

- సరైన నిర్ణయాలు తీసుకోవటంపై నాకు ఫోకస్ లేదు. నిర్ణయం తీసుకొని దానిని విజయవంతం చేయటమే నా పని.

- విజయం అనేది నువ్వు చేపట్టే పదవిపై ఆధారపడి ఉండదు. నువ్వు ఇతరులను ఎంతగా ప్రభావితం చేస్తున్నావన్న దానిపై ఆధారపడి ఉంటుంది.