వెండి తెరకు రతన్ టాటా జీవితం ఎప్పుడు సాధ్యం?
ఆయన చేసిన సేవల గురించి తెలిసింది కేవలం గోరంత మాత్రమే తెలియాల్సింది ఇంకా కొండత ఉంది.
By: Tupaki Desk | 11 Oct 2024 4:37 AM GMTపారిశ్రామిక దిగ్గజం, భారతదేశ గర్వం రతన్ టాటా మరణం కోట్లాది మంది హృదయాల్ని ఎంతగానో కలిచి వేసింది. ఆయన ఎంత గొప్ప పారిశ్రామిక వేత్తోనే అంతకు మించి గొప్ప మానవ ధృక్ఫధం గల ఓ లెజెండ్. వీధి కుక్కల శునకాల కోసమే ఎంతో చేసారు. అలాంటి లెజెండ్ మానవీయ కోణంలో ఇంకెన్ని సేవాకార్యక్రమాలు చేసారో. ఆయన చేసిన సేవల గురించి తెలిసింది కేవలం గోరంత మాత్రమే. తెలియాల్సింది ఇంకా కొండత ఉంది. డబ్బు, పేరు, పరపతి ఉన్నా? రతన్ టాటా ఎంతో సామాన్యమైన జీవితాన్నే గడిపారు.
ఏనాడు ఆయన స్థాయిని చూపించుకునే ప్రయత్నం చేయలేదు. సంపద తర్వాత ఆయన మనసంతా సేవకే అంకితమైంది. అందుకే అన్ని గొప్ప సేవా కార్యక్రమాలు చేయగలిగారు. డబ్బున్న ఎవ్వరూ చేయలేని కార్యక్రమాలు ఎన్నో రతన్ జీ చేసి ఓ చరిత్ర సృష్టించారు. అందుకే సేవా కార్యక్రమంలో ఆయన దేశం గర్వించే వ్యక్తిగా చరిత్ర పుట్టల్లోకి ఎక్కారు. అలా కోట్లాది మందికి ఓ ఇనిస్పేరేషన్ గా మారారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో ఎమోషన్ ఉంది.
ఆయన పెళ్లి చేసుకోలేదు. భార్య, పిల్లలు అంటూ ఎవరూ ఆయన జీవితంలో లేరు. అందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఆయన వివాహం చేసుకోవాలని నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రేమ పెళ్లి వరకూ వెళ్లినా? చివరి నిమిషంలో అది సాధ్యం కాలేదు. అలా వైఫల్యం అయ్యే సరికి ఆయన పూర్తిగా వివాహానికే దూరమయ్యారు. ఈ కోణంలో ఆయన జీవితంలో ఎంతో బలమైన ఎమోషన్ ఉందన్నది వాస్తవం.
అలాంటి లెజెండరీ జీవితాన్ని వెండి తెరకు ఎక్కించాల్సిన అవసరం ఎంతో ఉంది. దాన్నిఒక భాషకే పరిమితం దేశం నలుమూలాలా అలాంటి వ్యక్తి చరిత్ర చెప్పాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ సాహసం ఏ దర్శకుడు చేస్తాడు? అన్నది చూడాలి. గతంలో సుధ కొంగర రతన్ జీవితాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం సాగింది గానీ, ఆ ప్రచారాన్ని ఆమె కొట్టి పారేసారు.