Begin typing your search above and press return to search.

మైనంపల్లి బాటలో రాథోడ్ బాపూరావు

జాబితాలో అభ్యర్థిగా తన పేరు లేకపోవటంపై కినుకులో ఉన్న రాథోడ్ బాపూరావు.. తాజాగా పార్టీని విడిచి పెట్టి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:26 AM GMT
మైనంపల్లి బాటలో రాథోడ్ బాపూరావు
X

తాను కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగకపోవటాన్ని సీరియస్ గా తీసుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గులాబీ కారును వదిలేసి.. కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధం కావటం తెలిసిందే. తమకు మాట ఇచ్చిన ప్రకారం.. మెదక్ సీటును తన కొడుకును ఎంపిక చేసే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని తీవ్రంగా విభేదించిన ఆయన.. చివరకు పార్టీని విడిచి పెట్టి వెళ్లేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

తనకు టికెట్ ను ఇచ్చినప్పటికీ.. తన కుమారుడికి మెదక్ అసెంబ్లీ స్థానానికి అధికార పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయకపోవటాన్ని సీరియస్ గా తీసుకున్న మైనంపల్లి.. బీఆర్ఎస్ ను వీడి.. కాంగ్రెస్ లో చేరటానికి ఫిక్స్ కావటం.. ఆ విషయాన్ని తాజాగా వెల్లడించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మైనంపల్లి ఎపిసోడ్ ను గుర్తుకు తెచ్చేలా అదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే నిర్ణయం కూడా ఇదే తీరులో ఉండటం గమనార్హం.

ఆ మధ్యన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తన పేరు లేకపోవటాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. జాబితాలో అభ్యర్థిగా తన పేరు లేకపోవటంపై కినుకులో ఉన్న రాథోడ్ బాపూరావు.. తాజాగా పార్టీని విడిచి పెట్టి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఆయనకు బదులుగా నేరడిగొండ జెడ్పీటీసీ సభ్యుడు అనిల్ జాదవ్ పేరును సీఎం కేసీఆర్ ఫైనల్ చేయటం తెలిసిందే.

అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన.. తాజాగా తన పాలోవర్లతో సంప్రదింపులు జరిపి.. పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. అధికారికంగా తన నిర్ణయాన్ని నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తానని చెబుతున్న ఆయన తీరు అధికార బీఆర్ఎస్ కు షాకింగ్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. తదుపరి ఆయన అడుగులు ఏ పార్టీ వైపు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.