Begin typing your search above and press return to search.

రేషన్ మాఫియా... ఆఫ్రికన్ దేశాలకు ఆంధ్ర బియ్యం!

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు, పాలసీలపై పరిశీలన జరుగుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   30 Jun 2024 12:03 PM GMT
రేషన్ మాఫియా... ఆఫ్రికన్ దేశాలకు ఆంధ్ర బియ్యం!
X

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు, పాలసీలపై పరిశీలన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే లిక్కర్ పాలసీ, ఇసుక విధానాలపై పరిశీలన జరుగుతుండగా.. తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... ఏపీలోని రేషన్ బియ్యాన్ని ఆఫ్రికాలో విక్రయించేందుకు వైసీపీ ప్రభుత్వం ఎగుమతి చేసిందని అంటున్నారు!

అవును... ఏపీలోని రేషన్ బియాన్ని ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని.. కాకినాడ పోర్టును కూడా ద్వారంపూడి కుటుంబం కబ్జా చేసింద్ని.. ఈ మేరకు రేషన్ మాఫియా అక్రమాలపై సమగ్ర నివేదిక తయారుచేసి ఈ కేసును సీఐడీకి అప్పగిస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దీంతో... ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా కాకినాడ జిల్లాలో రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు మంత్రి నాదేండ్ల మనోహర్. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. మొత్తం ఎనిమిది గోదాముల్లో పేదలకు సరఫరా చేస్తున్న బియ్యం ఉన్నట్లు ఆధారాలతో సహా దొరికాయని.. ఈ క్రమంలోనే సుమారు 12,915 టన్నుల బియ్యం నిల్వలను సీజ్ చేశామని మంత్రి వెల్లడింఆరు.

ఈ సందర్భంగా గోడౌన్స్ లో ఎవరు ఏ స్టాక్ నిల్వ చేశారో తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పట్టుబడిన బియ్యం గురించి ప్రశ్నిస్తే కొంతమంది తమిళనాడు పౌరసరఫరాల శాఖకు, ఇతర ప్రాంతాలకూ పంపుతున్నట్లు చెబుతున్నారని.. పీడీఎస్ బియ్యం దారిమళ్లించినట్లు తేలిందని.. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని, నూటికీ నూరుశాతం క్రిమినల్ కేసులు పెడతామని అన్నారు.

అసలు కాకినాడ పోర్టులో సొంతంగా నౌక ఏర్పాటు చేసుకునే స్థాయికి అక్రమార్కులు ఎదిగారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చని.. ఆఫ్రికన్ దేశాలకు ఎంత బియ్యం ఎగుమతి చేశారో గ్రహించొచ్చని మంత్రి తెలిపారు.