Begin typing your search above and press return to search.

మళ్లీ కన్యగా మారాలని ఆపరేషన్... ఖర్చు ఎంతంటే..?

23 ఏళ్ల మోడల్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అయిన రవెనా హన్నీలీ.. తాను హైమెనోప్లాస్టీ చేయించుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   6 Dec 2024 4:06 AM GMT
మళ్లీ కన్యగా మారాలని ఆపరేషన్... ఖర్చు ఎంతంటే..?
X

నేరుగా విషయంలోకి వెళ్లిపోతే... బ్రెజిల్ కు చెందిన ఓ ఇన్ ఫ్లుయెన్సర్ మళ్లీ కన్యగా మారాలని ఆసక్తిగా ఉన్నారు. అందుకు కారణం... ఆత్మ గౌరవాన్ని తిరిగి పొందాలని.. కొత్త జీవితం ప్రారంభించాలని అంట. దీని కోసం ఆమె లక్షల రుపాయలు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. ఇది తన ఇతర మానసిక ప్రయోజనాలను కూడా అందిస్తు అందిస్తుందని అంటున్నారు.

అవును... 23 ఏళ్ల మోడల్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అయిన రవెనా హన్నీలీ.. తాను హైమెనోప్లాస్టీ చేయించుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రారంభంలో ఇది తనకు చాలా ముఖ్యమైనదని చెబుతోన్నారు. ఈ ప్రక్రియలో కరిగిపోయే కుట్లతో హైమెన్ లను కుట్టడం జరుగుతుందని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆమె... తాను మళ్లీ కన్యగా మారాలనుకుంటున్నానని.. ఇది తన ఆత్మగౌరవం కోసం, వ్యక్తిగత కారణాల వల్ల అని చెబుతున్నారు. ఈ ఆపరేషన్ కోసం రూ.16 లక్షల వరకూ ఖర్చవుతుందని.. ప్రక్రియ కోసం తేదీని నిర్ణయించాల్సి ఉందని.. ఈ విషయంలో వైద్యుల సలహాలు తు.చ. తప్పక పాటిస్తానని చెబుతున్నారు.

ఈ ఆపరేషన్ చేయించుకోవాలనే కోరికను హనీలీ ఈ రంగంలో నిపుణులైన వారిని సంప్రదించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా న్యూయార్క్ పోస్ట్ తో మాట్లాడిన ఆమె... లండన్ లోని మెడిసోనల్ క్లీనిక్ సీఈఓ డాక్టర్ హనా సులుసోలియా.. సౌందర్య ప్రక్రియ వాస్తవంగా కన్యత్వాన్ని పరిష్కరించదని పేర్కొన్నారని అంటున్నారు.