Begin typing your search above and press return to search.

'రేసుగుర్రం' అరెస్ట్ పై 'మద్దాలి శివారెడ్డి' సంచలన వ్యాఖ్యలు!

ఈ వ్యవహారం శుక్రవారం సాయంత్రానికి పూర్తిస్థాయిలో రాజకీయ కోణం తీసుకుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 Dec 2024 3:39 AM GMT
రేసుగుర్రం అరెస్ట్  పై మద్దాలి శివారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
X

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటూ యావత్ భారతదేశంలో సినీ ప్రపంచంలో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం శుక్రవారం సాయంత్రానికి పూర్తిస్థాయిలో రాజకీయ కోణం తీసుకుందని అంటున్నారు. ఈ సమయంలో బన్ని అరెస్టును కాంగ్రెస్ నేతలు సమర్ధిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోయిందని అంటున్నారు.

మరోపక్క అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రధానంగా తెలంగాణలో బీఆరెస్స్ నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ.. సీఎం రేవంత్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర, జాతీయ స్థాయి బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యను తప్పు బట్టారు! ఎవరు ఊహించని రీతిగా అన్నట్లుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు.. అరెస్టును ఖండించారు.

మరోపక్క ఈ అరెస్టుపై ఇండియా టుడే కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. తనదైన శైలిలో స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో సినిమా స్టారా.. పొలిటికల్ స్టారా అనేది చూడమని.. తప్పు ఎవరు చేసినా తప్పే అని అన్నారు. ఈ సమయంలో రేసుగుర్రం విలన్, బీజేపీ ఎంపీ రవి కిషన్ ఘాటుగా స్పందించారు.

అవును.. ప్రముఖ భోజ్ పూరి నటుడు, భారతీయ జనతాపార్టీ ఎంపీ (రేసుగుర్రం - మద్దాలి శివారెడ్డి) స్పందించారు. ఇందులో భాగంగా... అల్లు అర్జున్ అరెస్టు కావడం అనేది చలనచిత్ర పరిశ్రమకు చీకటి రోజు అని రవి కిషన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా... ఇదొక దురదృష్టకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు.

"అల్లు అర్జున్ నాకు మంచి స్నేహితుడు.. నా సహ నటుడు కూడా! ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న ఒక హీరోతో ఈ విధంగా ప్రవర్తిస్తారా? నటీనటులు అందరికీ, చలన చిత్ర పరిశ్రమకు ఇది ఒక చీకటి రోజు.. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి.. వ్యక్తిగత కారణాలతో అర్జున్ అరెస్ట్ జరిగినట్లు కనబడుతోంది" అని అన్నారు.

కాగా... అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి స్టార్లు కానీ, పెద్ద పెద్ద నటులు కానీ నేరుగా ఎవరూ స్పందించినట్లు కనిపించలేదని అంటున్నారు. ఒకరిద్దరు నటులు మాత్రం ఎక్స్ వేదికగా స్పందించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.. అల్లు అర్జున్ అరెస్టు ఇటు ఇండస్ట్రీలోనే కాకుండా అటు రాజకీయ రంగంలోనూ చర్చనీయాంశంగా మారింది.