రాయపాటి ఇళ్లపై ఈడీ నజర్.. ఏం జరిగింది?
తాజాగా ఈడీ అధికారులుపెద్ద ఎత్తున మోహరించి.. ఆయన ఇల్లు, కార్యాలయంతోపాటు.. కుటుంబ సభ్యుల ఇళ్లపైనా దాడులు చేస్తున్నారు
By: Tupaki Desk | 1 Aug 2023 1:24 PM GMTసీనియర్ రాయకీయ నాయకుడు.. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, ఆయన కార్యాల యా లపై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి జరుగుతున్న ఈ దాడులు.. సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే.. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా.. గతంలో పొగాకు వ్యాపారా నికి సంబంధించిన పన్నులు ఎగ్గొట్టడంతోపాటు.. కాంట్రాక్టు సంస్థగా ఉన్న రాయపాటి అల్లుడికి సంబంధించి మనీలాండరింగ్ జరిగినట్టు కేసులు నమోదుయ్యాయి.
పోలవరం ప్రాజెక్టును కాంట్రాక్టుకు చేపట్టిన సంస్థల్లో రాయపాటి అల్లుడి సంస్థ కూడా ఉంది. ఏడాది కిందట సీబీఐ అధికారులు ఇలానే రోజురోజంతా దాడులు చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. దీనిపై ఉలుకుపలుకు లేకుండా పోయింది.
తాజాగా ఈడీ అధికారులుపెద్ద ఎత్తున మోహరించి.. ఆయన ఇల్లు, కార్యాలయంతోపాటు.. కుటుంబ సభ్యుల ఇళ్లపైనా దాడులు చేస్తున్నారు. స్థానిక పోలీసులతో కలిసి.. ఈడీ అధికారులు దాడులు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న రాయపాటి.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.
అయితే.. ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో ఆయన వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. రాజకీయాలకు ఈడీ దాడులకు సంబంధంలేదని స్థానికంగా రాయపాటి వర్గంలో చర్చ సాగుతుండడం గమనార్హం.
గతంలో సీబీఐ సేకరించిన ఆధారాల నేపథ్యంలోనే.. ఈడీ ఇప్పుడు దాడులు చేసినట్టు చెబుతున్నారు. ఏదేమైనా.. రాయపాటి ఇంటిపై సుదీర్ఘంగా జరుగుతున్న దాడులు.. రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం సృష్టిస్తాయో చూడాలి.