రాయపాటి కుటుంబానికి వైసీపీ కండిషన్.. !
తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. సాయిరెడ్డి ద్వారా.. సీఎం జగన్ ఈ విషయాన్ని రంగారావుకు చేరవేసినట్టు సమాచారం.
By: Tupaki Desk | 20 Jan 2024 1:30 PM GMTఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన మాజీ ఎంపీ రాయపాటి కుటుంబం.. సంచలన వ్యాఖ్యలతో పొలిటికల్ సెగ రేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాయపాటి సాంబశివరావు తనయుడు, రంగారావు టీడీపీపై తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ సహా.. చంద్రబాబులపై విరుచుకుపడ్డారు. కట్ చేస్తే.. ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. దీనికి వైసీపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. ఆయనకు ఒక కీలక టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది.
ఈ ఒక్క బాధ్యత తప్ప.. మరేమీ చేయాల్సిన అవసరం లేదని, ఇదే సాధిస్తే.. రాజ్యసభకు పంపిస్తామని వైసీపీ హామీ ఇచ్చినట్టు సమాచారం. రంగారావు కూడా.. ఏది ఇచ్చినా ఓకే అనిరెడీగాఉన్నారు. ఇంతకీ వైసీపీ పెట్టిన టార్గెట్ ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అదే.. నారా లోకేష్‌ను మంగళగిరిలో ఓడించడం. నిజమే. ఈ లక్ష్యాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందిపై పెట్టాలనేది వైసీపీ వ్యూహంగా ఉంది.
ఈ క్రమంలోనే టీడీపీ నుంచి బయటకు వచ్చిన.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రంగారావుకు పార్టీ ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. సాయిరెడ్డి ద్వారా.. సీఎం జగన్ ఈ విషయాన్ని రంగారావుకు చేరవేసినట్టు సమాచారం. మంగళగిరిలో రాయపాటికి కూడా అనుచరులు, బంధువులు, ఇతర సామాజిక వర్గాల్లో సానుభూతి పరులు ఉన్నారు. వీరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి.. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని.. ఆయనను ఓడించాలని టార్గెట్‌గా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇక, ఇప్పుడు టీడీపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్న రంగారావు.. ఈ బాధ్యతను తీసుకునేందుకు రెడీ అయ్యార ని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఈ పనిచేస్తే.. రంగారావుకు ఎమ్మెల్సీ లేదా.. కీలకమైన రాజ్యస భకు పంపిస్తామని సాయిరెడ్డి ద్వారా. వర్తమానం అందింది. దీనికి ఆయన కూడా.. సరేననడం.. త్వరలోనే మంగళగిరిలో పర్యటనలు పెట్టుకునే దిశగా ఆలోచన చేస్తుండడం గమనార్హం. ఇక, రంగారావు ప్రభావం ఎంత ఉంటుంది? నారా లోకేష్‌ను ఏమేరకు ప్రభావితం చేయగలరు? అనేది ఎన్నికల తర్వాతే చూడాలి.