Begin typing your search above and press return to search.

అక్కడ నుంచి అంబటి రాయుడు బ్యాటింగ్ స్టార్ట్...?

ఒక సచిన్ టెండూల్కర్ మాదిరిగా తానూ పార్లమెంట్ లో సీటు చూసుకుని కూర్చోవాలని ఆయన ఆరాటపడుతున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:05 AM GMT
అక్కడ నుంచి అంబటి రాయుడు బ్యాటింగ్ స్టార్ట్...?
X

ప్రముఖ క్రికెటర్ గా యూత్ ఫాలోయింగ్ నిండా సంపాదించుకున్న అంబటి రాయుడుకు రాజకీయ ఆసక్తి అంతకంతకు పెరిగిపోతోంది. ఒక సచిన్ టెండూల్కర్ మాదిరిగా తానూ పార్లమెంట్ లో సీటు చూసుకుని కూర్చోవాలని ఆయన ఆరాటపడుతున్నారని అంటున్నారు. అంబటి రాయుడు గత కొన్నాళ్ళుగా చూస్తే రాజకీయ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అంతే కాదు ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ని బాగానే పొగుడుతున్నారు. ఒకటి రెండు పర్యాయాలు జగన్ని కలసి కూడా వచ్చారు.

మొత్తానికి ఆయన అధికార వైసీపీ పాలిటిక్స్ కి ట్యూనప్ అవుతున్నారు అని అంటున్నారు ఇటీవల కూడా ఆయన వైసీపీ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. తాను ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేసిన పార్టీగా వైసీపీ ఉందని అంబటి అన్నారు. దీంతో అంబటి పొలిటికల్ బ్యాటింగ్ కి ముహూర్తం దగ్గర పడింది అని అంటున్నారు.

ఇంతకీ అంబటి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది కీలకమైన ప్రశ్న. అలాగే రాజకీయంగా చూస్తే ఆసక్తిని పెంచే ప్రశ్న కూడా. అంబటి రాయుడు గుంటూరు నుంచి ఎంపీగా ఈసారి పోటీ చేయబోతున్నారు అన్నది ఒక ప్రచారంగా సాగుతోంది. అంబటి రాయుడుకి ఈ మేరకు అధికార వైసీపీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది అని అంటున్నారు. ఇక 2014, 2019లలో చూసుకుంటే రెండు పర్యాయాలూ గుంటూరు పార్లమెంట్ సీటు వైసీపీఎకి అందని పండుగా మారింది.

ఈ రెండు సార్లూ కూడా టీడీపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి గల్లా జయదేవ్ గెలిచారు. అయితే ఈసారి జయదేవ్ పోటీకి దూరంగా ఉండవచ్చు అని అంటున్నారు. ఆయన ప్లేస్ లో తెనాలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రంగంలో ఉంటారు అని అంటున్నారు. గుంటూరు ఎంపీ సీటు ప్రత్యేకత ఎంటి అంటే కాపులు ఎక్కువగా ఉన్న సీటు ఇది.

అయితే టీడీపీకి ఇపుడు జనసేన కూడా పొత్తు కలుస్తోంది కాబట్టి గత రెండు సార్లూ గెలిచిన టీడీపీకి మరో అడ్వాంటేజ్ ఇది అని అంటున్నారు. దాంతో వైసీపీ ఈసారి రూట్ మార్చి అంబటి రాయుడుని పోటీకి దించాలని చూస్తోంది అని అంటున్నారు. 2014లో కాపు సామాజికవర్గానికి చెందిన వల్లభనేని బాలశౌరికి టికెట్ ఇచ్చింది వైసీపీ. అయినా ఆయన ఓడారు.

ఇక 2019 నాటికి టీడీపీ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఆయన కూడా పరాజయం పాలు అయ్యారు. పైగా మోదుగుల చాలా కాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు. దాంతో ఈసారి అంబటిని ఈ సీటు నుంచి పోటీ చేయిస్తే తమకు మేలు జరుగుతుందని యూత్ ప్లస్ కాస్ట్ ప్లస్ ఇతర సమీకరణలు కూడా ఫేవర్ చేస్తాయని వైసీపీ అంచనా కడుతోంది.

ఇవన్నీ చూస్తూ ఉంటే అంబటి రాయుడు వైసీపీకి బెస్ట్ చాయిస్ అవుతారు అనే అంటున్నారు. అంబటి కూడా తన రాజకీయ క్షేత్రంగా గుంటూరునే తీసుకుని చాలా కాలంగా అక్కడే పర్యటిస్తున్నారు. ఈ డిసెంబర్ దాటితే వైసీపీ దూకుడు చేస్తుందని ఎంపీల జాబితాను కూడా కొత్త ఏడాదిలో ప్రకటిస్తుందని అందులో తొలిగా వచ్చే పేరు అంబటి రాయుడిది ఉంటుందని అంటున్నారు.

అయితే ఈసరికే వైసీపీ హై కమాండ్ చెప్పాల్సిన వారికి చెప్పేసి ఆయా చోట్ల ప్రచారం చేసుకోమని కోరింది అని అంటున్నారు. అలా అంబటికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు.ఇంతకాలం క్రికెట్ లో తనదైన బ్యాటింగ్ తో చెలరేగిన అంబటి రాయుడు పొలిటికల్ బ్యాటింగ్ ఎలా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది.