Begin typing your search above and press return to search.

రాయుడు సెకండ్ ఇన్నింగ్స్... వైసీపీ కండువాతో ఫస్ట్ స్టేట్ మెంట్ వైరల్!

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. అంబటి రాయుడికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు

By:  Tupaki Desk   |   29 Dec 2023 2:00 AM GMT
రాయుడు సెకండ్  ఇన్నింగ్స్... వైసీపీ కండువాతో ఫస్ట్  స్టేట్  మెంట్  వైరల్!
X

ఎప్పటినుంచో ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో నానుతున్న టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడి రాజకీయ రంగ ప్రవేశం ఖరారైంది. ఇందులో భాగంగా తాజాగా ఆయన వస్తున్న ఊహాగాణాలకు బలం చేకూరుస్తూ అధికార వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. అంబటి రాయుడికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇప్పుడు ఈ ఇష్యూ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.

అవును... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా... తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో అంబటి రాయుడికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్‌.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.

వైసీపీ కండువా కప్పుకున్న అనంతరం అంబటి రాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని తెలిపారు. ఇదే క్రమంలో... సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరటం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుంచి జగన్ మీద తనకు మంచి అభిప్రాయం ఉందని.. ఆయన కులమతాలు అతీతంగా, రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా, పూర్తి పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు.

ఇదే సమయంలో... జగన్ పూర్తి నిష్పక్షపాతంగా పాలన సాగిస్తున్నారనే విషయం తనకు నచ్చే అప్పుడప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఆయన గురించి, ఆయన పాలన గురించి స్పందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విపక్షాలకు కీలక ప్రశ్న సంధించరు రాయుడు. ఇందులో భాగంగా... వైసీపీ సంక్షేమ పథకాలపై గతంలో చాలా ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ లు ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని ఎలా చెప్తారని ప్రశ్నించారు.

కాగా... గత కొంతకాలంగా ఏపీలో అంబటి రాయుడి రాజకీయ అరంగేట్రంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... గుంటూరుతో పాటు పలు జిల్లాల్లో పర్యటిస్తోన్న అంబటి రాయుడు.. విద్యార్థులు, యువతను కలిసి క్రీడలతో పాటు పలు విషయాలపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారికంగా వైసీపీలో చేరారు!