Begin typing your search above and press return to search.

ట్రంప్‌ ను కాల్చడానికి అసలు కారణం అదేనా?

ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులకు పాల్పడ్డ 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ గురించి తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   15 July 2024 3:30 PM GMT
ట్రంప్‌ ను కాల్చడానికి అసలు కారణం అదేనా?
X

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. అతణ్ని 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ గా ధ్రువీకరించారు. అతడిది పెన్సిల్వేనియాలోని బెతెల్‌ పార్క్‌ ప్రాంతమని సమాచారం.

బెతెల్‌ పార్క్‌ హైస్కూలులో అతడు 2022లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఒక నర్సింగ్‌ హోంలో పనిచేస్తున్నాడని చెబుతున్నారు.ట్రంప్‌ పై కాల్పులకు ముందు అతడు రికార్డు చేశాడని చెబుతున్న ఓ వీడియో కూడా వైరల్‌ అవుతోంది. అందులో రిపబ్లికన్‌ పార్టీని, ట్రంప్‌ ను తాను ద్వేషిస్తున్నానని అతడు చెప్పడం గమనార్హం.

నిందితుడు థామస్‌ మాథ్యూ క్రూక్‌ రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారుడే. ఈ విషయాన్ని స్వయంగా అతడే గతంలో పేర్కొన్నాడు. ప్రభుత్వ ఓటింగ్‌ రికార్డుల ప్రకారం.. అతడు రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదాడిగా నమోదు చేసుకున్నాడు. అయితే అతడు 2021లో డెమోక్రటిక్‌ పార్టీకి అనుబంధంగా ఉండే ప్రోగ్రెసీవ్‌ టర్న్‌ ఔట్‌ కు 15 డాలర్ల విరాళాన్ని ఇవ్వడం విశేషం.

ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులకు పాల్పడ్డ 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ గురించి తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

థామస్‌ మాథ్యూ పాఠశాలలో ఉన్నప్పుడు తోటి విద్యార్థుల నుంచి తీవ్రమైన వేధింపులు ఎదుర్కొన్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా అతడు ధరించే దుస్తులను చూసి తోటి విద్యార్థులు అతడిని గేలిచేసేవారని సమాచారం. ఈ విషయాన్ని అతడి క్లాస్‌ మేట్‌ ఒకరు వెల్లడించారు. థామస్‌ మాథ్యూ స్కూలులో ఎప్పుడూ మౌనంగా ఉండేవాడనీ.. ఎవరినీ కలిసేందుకు ఇష్టపడేవాడు కాదని తెలుస్తోంది. ఎప్పడూ ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడేవాడు అతడి క్లాస్‌ మేట్‌ వెల్లడించాడు.

అలాగే థామస్‌ స్కూలులో ఉన్నప్పుడు రాజకీయాలు గురించి కానీ, ట్రంప్‌ గురించి కానీ మాట్లాడటం తాము చూడలేదని అతడి క్లాస్‌ మేట్స్‌ చెబుతున్నారు. అలాంటి వాడు ఇలా కాల్పులకు ఎందుకు తెగించాడనేది అంతుబట్టడం లేదు. అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడమే ఇందుకు కారణమని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నారు.

అయినా థామస్‌ మాథ్యూ పక్కా ప్లాన్‌ తోనే ట్రంప్‌ పై దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ట్రంప్‌ పై హత్యాయత్నానికి ముందే అతడు సమీపంలోని ఒక ఇంటిపై నక్కి ఉన్నాడు. ట్రంప్‌ ప్రచార వేదికకు 100 మీటర్ల సమీప దూరం నుంచే తన టార్గెట్‌ (ట్రంప్‌) ను చేధించేందుకు సెమీ ఆటోమేటిక్‌ రైఫిల్‌ ను సిద్ధంగా ఉంచుకున్నాడు. అతడిని వెంటనే కాల్చిచంపిన పోలీసులు అతడి వద్ద ఉన్న రైఫిల్‌ ను స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద పోలీసులకు ఎలాంటి ఐడీ కార్డులు దొరకలేదు.

కాగా థామస్‌ మాథ్యూకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ముందుగానే సోషల్‌ మీడియాలో, మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. మరోవైపు ఈ ఘటనపై పూర్తి విచారణ జరపుతామని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌ఐబీ) ప్రకటించింది. దుండగుడికి సంబంధించి మరిన్ని విషయాలు ఎవరికైనా తెలిస్తే తమకు వెల్లడించాలని కోరింది.