Begin typing your search above and press return to search.

చున్నీతో కట్టేసి..గొంతుకోసి..భర్తను దారుణంగా చంపేసింది!

ఇలాంటి కోవకు చెందిందే హైదరాబాద్ లోని ఓ రియల్టర్ దారుణ హత్య ఘటన.

By:  Tupaki Desk   |   5 March 2025 10:57 AM IST
చున్నీతో కట్టేసి..గొంతుకోసి..భర్తను దారుణంగా చంపేసింది!
X

సమాజంలో బంధాలు, అనుబంధాలు, అప్యాయతలకు చోటులేకుండా పోతోంది. మనుషులకు ఆర్థిక విషయాలు, లైంగికసంబంధాలే ముఖ్యమైపోతున్నాయి. వీటి మత్తులో పడి కుటుంబ సభ్యులనే హతమారుస్తున్నారు. మొన్న ఓ బడా పారిశ్రామికవేత్తను కంపెనీ బాధ్యతల కోసం సొంత మనవడే దారుణంగా చంపేశాడు. ఇక నిన్న 100 కోట్ల ఆస్తి తనకు రాసివ్వాలని సొంత కొడుకే..నవమోసాలు మోసి కని, పెంచిన తల్లిని హతమార్చాడు. భూముల కోసం అన్నాదమ్ముళ్ల హత్యలు, లైంగిక సంబంధాలతో భర్తలను చంపడం, భార్యలను చంపడం.. నిత్యం సహజమైపోతోంది. క్షణికావేశంలో చేసే తప్పు వారిని కటకటాల వెనక్కి పంపుతుంది. వారి కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. పిల్లలు అనాథలవుతారు. కానీ వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ క్షణం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిందే హైదరాబాద్ లోని ఓ రియల్టర్ దారుణ హత్య ఘటన.

హైదరాబాద్ లోని పాతబస్తీ బండ్లగూడ ఠాణా పరిధిలో మంగళవారం ఓ రియల్టర్ ను సొంత భార్య దారుణంగా చంపేసింది. చాంద్రాయణగుట్ట ఏసీపీ కె.మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ కు చెందిన మసీయుద్దీన్(57) కొన్నేళ్ళ క్రితం షబానాను పెళ్లి చేసుకున్నాడు. ఈమె అతడికి మూడో భార్య. అప్పటికే ఆమెకు సమీర్ అనే కొడుకు ఉన్నాడు. బండ్లగూడ క్రిస్టల్ టౌన్ షిప్ లోని ఓ అపార్ట్ మెంట్ లో రెంట్ కు ఉంటున్న షబానా వద్దకు మసీయుద్దీన్ రోజూ వచ్చి వెళ్లేవాడు. సోమవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మంగళవారం ఉదయం మసీయుద్దీన్ మళ్లీ వచ్చాడు. అప్పటికే షబానా, ఆమె కుమారుడు సమీర్, అతడి స్నేహితుడు ఫరీద్ ఇంట్లో ఉన్నారు.

వారు పన్నిన ప్లాన్ ప్రకారం షబానా సమీర్ తో కలిసి చున్నీతో మసీయుద్దీన్ చేతులు వెనక్కి విరిచి కట్టేసింది. కాళ్లు సైతం కట్టేసి నోట్లో గుడ్డలను కుక్కింది. ఫరీద్ తో కలిసి గొంతుకోసి హతమార్చింది. రాత్రి బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో నిందితులు లొంగిపోయి మసీయుద్దీన్ ను హత్య చేసిన విషయం తెలిపారు.

షబానా వివాహేతర సంబంధమే హత్యకు కారణం కావొచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం తెలిసి మసీయుద్దీన్ ఆమెతో గొడవకు దిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మసీయుద్దీన్ అడ్డు తొలగించుకుంటేనే తన వివాహేతర సంబంధం సాఫీగా సాగుతుందని భావించిన షబానా తన కొడుకు, అతడి ఫ్రండ్ తో కలిసి ఆఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి విషయం పోలీసుల విచారణలో బయటపడనుంది.