Begin typing your search above and press return to search.

అయోధ్యలో బీజేపీ ఓటమికి షాకింగ్ రీజన్!

తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆ అయోధ్య రామాలయం ఉన్న లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ ఓటమి పాలైంది.

By:  Tupaki Desk   |   9 Jun 2024 5:01 AM GMT
అయోధ్యలో బీజేపీ ఓటమికి షాకింగ్  రీజన్!
X

అయోధ్యలో రామాలయం పూర్తయినప్పుడు, ఇక ఆ ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సమయంలోనూ బీజేపీకి మోడీకి కలిగిన ప్రచారం గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవచ్చు. సుమారు 500 ఏళ్ల కల అయోధ్యలో రామాలయం.. దాన్ని నిజం చేసింది మోడీ & కో దళం అన్న స్థాయిలో ప్రచారాలు చేశారు.

ఇక ఎన్నికల ప్రచార సమయంలోనూ దేశవ్యాప్తంగా అయోధ్యలో రామాలయ నిర్మాణం అనే విషయాన్ని ప్రధాన అంశంగా మార్చింది బీజేపీ! అయితే దేశంమొత్తం ప్రచారం సంగతి అలా ఉంచితే... తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆ అయోధ్య రామాలయం ఉన్న లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ ఓటమి పాలైంది.

అవును... ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోకి వస్తుంది అయోధ్య! అయితే.. ఇక్కడ మోడీ ఎంత ప్రచారం చేసినా, బీజేపీ ఎంత హడావిడి చేసినప్పటికీ అయోధ్య ప్రజలు బీజేపీని పక్కనపెట్టారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిని 54,567 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. దీంతో... ఇక్కడ పోస్ట్ మార్టం చేయడం మొదలుపెడితే... అసలు విషయం తెరపైకి వచ్చిందని అంటున్నారు.

అయోధ్యలో రామాలయం నిర్మాణం చేపట్టిన సమయంలో సువిశాలమైన స్థలం అవసరం పడిన సంగతి తెలిసిందే. దీంతో.. రామాలయం ఉన్న ప్రాంత పరిసరాల్లో ఉన్నటువంటి దుకాణాలన్నింటినీ తొలగొట్టించి ఆ స్థలాలను స్వాధీనం చేసుకున్నారు! ఈ నేపథ్యంలో ఒక్కో దుకాణానికి రెండు లక్షల రూపాయలు పరిహారం మాత్రం చెల్లించారట. రామాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత దుకాణాలకు అనుమతి ఇస్తామని కూడా చెప్పారని అంటున్నారు.

అయితే... తీరా ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత కొత్త దుకాణాల కేటాయింపుల పర్వం వచ్చేసారికి స్థానిక బీజేపీ నేతలు ప్లేట్ ఫిరాయించారని అంటున్నారు. ఇందులో భాగంగా దుకాణాలు కేటాయిస్తామని రెండు లక్షల పరిహారానికే ఒప్పించిన వారు.. తీరా ఆ సమయం వచ్చేసారికి ఒక్కో దుకాణానికి 15 - 20 లక్షల రూపాయలవరకూ కట్టాల్సిందేననే దందా చేశారట.

దీంతో... స్థానిక బీజేపీ నేతల తీరుతో స్థానిక ప్రజలు, దుకాణదారులు విసిగిపోయారని అంటున్నారు. దీంతో అయోధ్యలో బీజేపీకి చెక్ పెట్టాలని భావించారో ఏమో కానీ... ఓటు అనే ఆయుధంతో బీజేపీ అభ్యర్థిని మట్టికరిపించారు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో... అయోధ్యలో బీజేపీ ఓడిపోవడానికి అసలు కారణం ఇదా అని అంటున్నారు విషయం తెలిసిన ప్రజానికం!