షాకిస్తున్న బ్రిటన్ లెక్కల టీచర్ సెక్సు పాఠాలు!
బ్రిటన్ లో లెక్కల టీచర్ ఉదంతం ఇప్పుడ సంచలనంగా మారింది. ఆమె తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు
By: Tupaki Desk | 9 May 2024 7:30 AM GMTబ్రిటన్ లో లెక్కల టీచర్ ఉదంతం ఇప్పుడ సంచలనంగా మారింది. ఆమె తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. ఆమె తీరును తప్పు పడుతున్నారు. గతంలో ఆమె ఉదంతం బ్రిటన్ వ్యాప్తంగా సంచలనంగా మారితే.. తాజాగా ఎపిసోడ్ 2తో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రొఫెషనల్ గా లెక్కల టీచర్ చేస్తున్న సెక్సు లెక్కలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. తనకంటే చాలా తక్కువ వయసున్న పిల్లలతో ఆమె యవ్వారాలు ఇప్పుడు హాట్ చర్చగా మారాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే..
బ్రిటన్ కు చెందిన రెబక్కా జాయ్ నెస్ లెక్కల టీచరుగా పని చేస్తుంటారు. ముప్ఫై ఏళ్ల వయసున్న ఆమె మూడేళ్ల క్రితం (2021లో) తన దగ్గర చదువుకునే పిల్లాడికి ప్రైవేటు క్లాసుల్ని తీసుకునేది. ఈ క్రమంలో అతడికి తన పదకొండు నెంబర్ల ఫోన్ నెంబరు ఇచ్చే క్రమంలో ఒక నెంబరు మిస్ చేసి.. ఆ నెంబరు కనుగోవాలన్న సవాలు విసిరింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య మొదలైన మేసేజ్ లు మరో బంధానికి తెర తీశాయి.
ఈ క్రమంలో ఒక రోజు తన స్టూడెంట్ ను షాపింగ్ కు తీసుకెళ్లిన ఆమె ఖరీదైన గూచీ బెల్ట్ ను గిప్టుగా ఇచ్చింది. ఆ తర్వాత తన అపార్టుమెంట్ కు తీసుకెళ్లిన ఆమె.. అతడితో లైంగిక సంబంధాన్ని ఏర్పర్చుకుంది. ఈ విషయాన్ని అతను తన స్నేహితులకు చెప్పటంతో అది కాస్తా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆమెను అరెస్టు చేయటం.. బ్రిటన్ వ్యాప్తంగా సదరు లెక్కల టీచర్ వ్యవహారం సంచలనంగా మారింది.
కట్ చేస్తే.. ఈ కేసులో జైలుపాలైన ఆమె.. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ కేసు విచారణలో ఉన్న వేళలో ఆమె మరో బాలుడికి దగ్గరయ్యారు. స్నాప్ చాట్ లో పరిచయమైన అతడికి తన ఫోటోల్ని పంపి.. నెమ్మదిగా తన ముగ్గులోకి వేసుకుందని.. అతడితో తన కోర్కెల్ని తీర్చుకొని ప్రెగ్నెంట్ కావటం సంచలనంగా మారింది. ఆమె తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి తాను ఎలాంటి తప్పు చేయలేదని.. రెండో బాలుడికి పదహారేళ్లు నిండిన తర్వాతనే రిలేషన్ పెట్టుకున్నట్లుగా ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం ఈ లెక్కల టీచర్ వ్యవహారం బ్రిటన్ లో ఇప్పుడు సంచలనంగా మారింది.