'పుష్ప-2' కలెక్షన్స్ తో పోటీ... ఈ పెంట్ హౌస్ ధర ఎంతో తెలుసా?
ఉత్తర భారతదేశానికి చెందిన గుర్గావ్.. ఆ ప్రాంతంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సెలబ్రెటీలకు నిలయంగా పరిగణించబడుతుంది.
By: Tupaki Desk | 9 Dec 2024 3:55 AM GMTప్రపంచ వ్యాప్తంగా అత్యంత సక్సెస్ ఫుల్ బిజినెస్ కానీ.. పెట్టుబడులు పెట్టడానికి అనువైన విభాగం కానీ రియల్ ఎస్టేట్ అని చాలా మంది చెబుతుంటారు. ఈ సృష్టిలో రోజు రోజుకీ పెరిగే ధరల్లో టాప్ రో లో ల్యాండ్ రేట్స్ ఉంటాయని అంటారు. ఇందుకు అత్యంత తాజాగా ఉదాహరణలు హైదరాబాద్ లోని కోకాపేట్ ల్యాండ్స్ గా చెప్పుకోవచ్చు.
గత ఏడాది కోకాపేట ప్రాంతంలోని ప్లాట్లు ఎకరానికి రూ.100 కోట్లకు విక్రయించబడినట్లు వార్తల్లో వైరల్ గా మారింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోని రియల్ ఎస్టేట్ లో సరికొత్త రికార్డ్ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ అపార్ట్ మెంట్ లోని పెంట్ హౌస్ కోసం సుమారు రూ.190 కోట్లు వెచ్చించిన విషయం వెలుగులోకి వచ్చింది.
అవును... ఉత్తర భారతదేశానికి చెందిన గుర్గావ్.. ఆ ప్రాంతంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సెలబ్రెటీలకు నిలయంగా పరిగణించబడుతుంది. అనేక నాగరిక, ఉన్నత స్థాయి ప్రాంతాలను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో డీ.ఎల్.ఎఫ్. కామొలియాస్ లోని ఒక అపార్ట్ మెంట్ ఇటీవల భారీ ధరకు విక్రయించబడి వైరల్ గా మారింది!
ఇందులో భాగంగా... ఇన్ఫో ఎక్స్ సార్ట్ వేర్ టెక్ ప్రై. లి. అనే కంపెనీ 16,290 చదరపు అడుగుల పెంట్ హౌస్ ని దక్కించుకునేందుకు రూ.190 కోట్లు వెచ్చించిందని అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 13 కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు చెబుతున్నారు. డిసెంబర్ 2న ఈ లావాదేవీ అధికారికంగా నమోదైనట్లు తెలుస్తోంది.
దీంతో... ఈ డీల్ ను ఇండియాలోనే ఎత్తైన అపార్ట్మెంట్ కు చదరపు అడుగుకు అత్యధికంగా చెలించిన ధరగా చెబుతున్నారు రియల్ ఎస్టేట్ విశ్లేషకులు. దీంతో... ఈ విషయం షాకింగ్ గా మారింది. ఢిల్లీ, ముంబై లంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ ధరలు గుర్గావ్ ప్రాంతంలో కనిపించడం ఆసక్తిగా మారింది!
ఈ నేపథ్యంలోనే రోజు రోజుకీ విజృంభిస్తున్న రియల్ ఎస్టేట్ ధరలు ‘పుష్ప-2’ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తో పోటీ పడుతున్నాయని అంటున్నారు నెటిజన్లు.