Begin typing your search above and press return to search.

అమెరికాలో ఆసక్తికరంగా తొలి ఫలితం... తెరపైకి రీకౌంటింగ్ టాపిక్!

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత హాట్ టాపిక్ గా మారిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ జోరుగా సాగుతోంది.

By:  Tupaki Desk   |   6 Nov 2024 3:58 AM GMT
అమెరికాలో ఆసక్తికరంగా తొలి ఫలితం... తెరపైకి రీకౌంటింగ్  టాపిక్!
X

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత హాట్ టాపిక్ గా మారిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ జోరుగా సాగుతోంది. తమ 47వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పోలింగ్ రోజు ఓటర్లు పోటెత్తారు! ఈ సమయంలో తొలి ఫలితం వెలువడింది. ఈ ఎన్నికల్లో ట్రంప్ వర్సెస్ కమలా హారిస్ మధ్య పోటీ ఏ స్థాయిలో ఉందో చెప్పేలా ఆ ఫలితం ఓ ఉదాహరణగా మారింది.

అవును... అధ్యక్ష ఎన్నికల ఓట్ల పోలింగ్ కేంద్రాలకు అమెరికన్లు పోటెత్తారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 16 కోట్ల మందికి పైగా రిజిస్టర్ చేసుకోగా.. వారిలో 8.2 కోట్ల మంది ముందస్తుగా మంగళవారం కంటే ముందే ఓటేశారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే... డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తెలుస్తోందని అంటున్నారు.

ఇక ఈ ఎనికల్లో అధ్యక్ష అభ్యర్థులు ఇద్దరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా... డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో ఓటు వేశారు.. అనంతరం తన ఎస్టేట్ కు వెళ్లిపోయారు. ఇదే సమయంలో.. తన సొంత రాష్ట్రమైన కాలిఫోర్నియాలో మెయిల్ ద్వారా ఓటు వేశారు కమలా హారిస్.

మరోపక్క.. ఒమాహో, నెబ్రాస్కా, హ్యూస్టన్ లలో భారీ వర్షాలు పడుతున్నా.. ఓటర్లు గొడుగులతో వచ్చి ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక మోంటానా, కొలరాడోలో మంచునూ లెక్కచేయకుండా జనం పెద్ద ఎత్తున క్యూలో ఉన్నారు. కాగా.. ఎన్నికల్లో గట్టి పోటీ ఉందని, ఓటర్లంతా పోలింగ్ లో పాల్గొనాలని బరక్ ఒబామా పిలుపునిచ్చారు.

తొలి ఫలితం టైం అయ్యింది:!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ - కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొందని సర్వేలన్నీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లు గానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఫలితాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా... అతి చిన్న పోలింగ్ కేంద్రమైన డిక్స్ విల్లే నాచ్ లో ఫలితం టై అయ్యింది.

ఇందులో భాగంగా... ఇక్కడ ఆరు ఓట్లు ఓలవ్వగా... రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కు చెరో మూడు ఓట్లు పోలయ్యాయి. అయితే... గత ఎన్నికల్లో ఇక్కడ డెమోక్రట్ అభ్యర్థి జో బైడెన్ ఆధిక్యం సాధించారు. ఈసారి ట్రంప్ దాన్ని టైగా మార్చగలిగారు!

అక్కడ అడగకపోయినా రీకౌంటింగ్!:

ఇలా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి ఫలితం టైం అయిన నేపథ్యంలో... చాలా చోట్ల స్వల్ప తేడాలతోనే గెలుపోటములు నిర్ణయించే ఫలితం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. తేడా మరీ స్వల్పంగా ఉంటే రీకౌంటింగ్ కి వెళ్తారని చెబుతున్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఈ నేపథ్యంలో ఈ రీకౌంటింగ్ నిబంధనలు ఏయే రాష్ట్రాల్లో ఏయే విధాలుగా ఉన్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఉదాహరణకు... మిషిగన్ స్టేట్ లో రెండు వేల కంటే తక్కువ తేడా ఉంటే రీకౌంటింగ్ చేస్తారు.

ఇక అరిజోనా, పెన్సిల్వేనియాలో గెలుపోటముల మధ్య తేడా అరశాతం, అంతకంటే తక్కువ ఉంటే అభ్యర్థి అడగకపోయినా రీకౌంటింగ్ చేస్తారు. ఇదే సమయంలో... జార్జియాలో అభ్యర్థి కానీ, అధికారులు కానీ అడిగితేనే రీకౌంటింగ్ కు వెళ్తారు.