Begin typing your search above and press return to search.

ఆ పోలీసులకు రెడ్ బుక్ టెన్షన్?

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ లో పేర్లున్న పోలీసులు, అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించారు.

By:  Tupaki Desk   |   21 May 2024 10:11 AM GMT
ఆ పోలీసులకు రెడ్ బుక్ టెన్షన్?
X

రెడ్ బుక్...టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొద్ది నెలల క్రితం చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా బాగా హైలైట్ అయిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం చెప్పినదానికి తల ఊపి టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన కొందరు పోలీసులు, అధికారుల పేర్లు ఈ రెడ్ బుక్ లో ఉన్నాయని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ లో పేర్లున్న పోలీసులు, అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. ఇక, లోకేష్ రెడ్ బుక్ పేరు చెప్పి అధికారులు, పోలీసులను భయపెడుతున్నారని కొందరు కోర్టు తలుపు కూడా తట్టారు.

ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ రెడ్ బుక్ లో ఉన్న పోలీసులు, అధికారులకు టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. వైసీపీ అండ చూసుకొని గతంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై రెచ్చిపోయిన కొందరు పోలీసులు, అధికారులు రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనలో పడ్డారట. ఇక, వైసీపీకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న సంకేతాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో ట‌చ్‌లోకి కొందరు వెళుతున్నారని తెలుస్తోంది.

వైసీపీ ప్ర‌భుత్వ పెద్దలు చెప్పినట్లు తాము చేయాల్సి వచ్చిందని, టీడీపీకి వ్య‌తిరేకం కాద‌ని వివరణనిచ్చే ప్రయత్నాలు వారు చేస్తున్నారట. ఇక, జగన్ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న టీడీపీ అనుకూల పోలీసులు, అధికారులు కొందరు చంద్రబాబును ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది...ఎవరిపై చర్యలుంటాయి అన్న సంగతి తేలాలంటే జూన్ 4 వరకు వేచిచూడక తప్పదు.