Begin typing your search above and press return to search.

రిలయన్స్ ముందు వెలవెల పోయిన యాపిల్.. మైక్రోసాఫ్ట్

ఆసక్తికరమైన అంశం ఏమంటే 2023లో 13వ స్థానంలో ఉన్న రిలయన్స్.. ఏడాది వ్యవధిలో ఏకంగా పదకొండు స్థానాల్ని అధిగమించి.. టాప్ త్రీ బ్రాండ్లలో ఒకటిగా నిలవటం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   18 Feb 2025 5:19 AM GMT
రిలయన్స్ ముందు వెలవెల పోయిన యాపిల్.. మైక్రోసాఫ్ట్
X

అన్ స్టాపబుల్ అన్నట్లుగా సాగుతున్న రిలయన్స్ జర్నీలో మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. గడిచిన కొంతకాలంగా రిలయన్స్ సంస్థ ఏం చేసినా సక్సెస్ అన్నట్లు సాగుతోంది. తాజాగా ఈ సంస్థ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2024 ఏడాదికి గాను విడుదల చేసిన ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ లో రిలయన్స్ ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్రాండ్ గా నిలవటం ఆసక్తికరంగా మారింది.

ఆసక్తికరమైన అంశం ఏమంటే 2023లో 13వ స్థానంలో ఉన్న రిలయన్స్.. ఏడాది వ్యవధిలో ఏకంగా పదకొండు స్థానాల్ని అధిగమించి.. టాప్ త్రీ బ్రాండ్లలో ఒకటిగా నిలవటం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా తోపుల్లాంటి దిగ్గజ బ్రాండ్లను దాటేసింది. రెండో స్థానానికి చేరుకున్నరిలయన్స్.. తాను దాటేసిన బ్రాండ్ల జాబితా తెలిస్తే.. అవాక్కు అవ్వాల్సింది. ఆ జాబితాలో..

- యాపిల్‌

- మైక్రోసాఫ్ట్‌

- నైకీ

- వాల్ట్‌డిస్నీ

- నెట్‌ఫ్లిక్స్‌

- ఇంటెల్‌

- టయోటా బ్రాండ్లు ఉండటం విశేషం. ఈ బ్రాండ్లను దాటేసి రెండో స్థానానికి చేరుకోవటం ద్వారా.. ఈ ఘనతను సాధించిన మొదటి సంస్థగా అవతరించింది. ఈ జాబితాలో టాప్ వన్ లో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్ సంగ్ నిలిస్తే.. రిలయన్స్ రెండో స్థానంలో నిలిచింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారే బ్రాండ్ లక్ష్యం.. అనుభవాన్ని సమతుల్యం చేసుకోగలిగిన సామర్థ్యం ఆధారంగా ఫ్యూచర్ బ్రాండ్ కంపెనీల మదింపు చేపట్టారు.

అత్యుత్తమ ఫ్యూచర్ బ్రాండ్లు తమ ప్రధాన గుర్తింపును కాపాడుకుంటూనే.. మారుతున్న వినియోగదారుల అంచనాలు.. సాంకేతిక పురోగతులు.. మార్కెట్ స్థితిగతుల్ని చాకచక్యంగా ఒడిసిపట్టుకోగలుతుతాయి. తామేంటి? తమ మనుగడ ఏమిటి? అన్న అంశాలపై వాటికి స్పష్టమైన అవగాహన ఉందని ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ రిపోర్టు వెల్లడించింది. ఇక్కడో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించాలి. గతంలో అమెరికా.. యూరప్ దేశాల్లోని దిగ్గజ సంస్థలు తమ బ్రాండ్లపై గణనీయంగా ఇన్వెస్టు చేస్తుండేవారు. ఇప్పుడు ఆసియా పసిఫిక్.. మధ్య ప్రాచ్య దేశాల సంస్థలు తమ ఫోకస్ ను మార్చాయని చెప్పాలి.

2014లో టాప్ 10 బ్రాండ్లలో అమెరికా కంపెనీలు ఏడు ఉండగా.. 2024 వచ్చేసరికి 4 అమెరికన్ బ్రాండ్లు.. 5 ఆసియా పసిఫిక్ బ్రాండ్లు.. పశ్చిమాసియాకుచెందిన ఒక బ్రాండ్ నిలిచాయి. 2014లో టాప్ 10లో నిలిచిన బ్రాండ్లు..

- గూగుల్

- యాపిల్

- మైక్రోసాఫ్ట్

- వాల్ట్ డిస్నీ

- శాంసంగ్

- ఇంటెల్

- టయోటా

- జాన్సన్ అండ్ జాన్సన్

- ఐబీఎమ్

- యూనిలీవర్

సరిగ్గా పదేళ్లకు అంటే 2024 నాటికి ఈ జాబితాలో మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అదేమిటో టాప్ 10 లో ఉన్న కంపెనీలు.. వాటికి ప్రాతినిధ్యం వహించే దేశాల్నిచూస్తే.. మార్పు ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

ర్యాంక్ కంపెనీ దేశం

01 శాంసంగ్ దక్షిణ కొరియా

02 రిలయన్స్ భారతదేశం

03 యాపిల్ అమెరికా

04 నైక్ అమెరికా

05 ఏఎస్ఎమ్ఎల్ నెదర్లాండ్స్

06 డనహర్ కార్పొరేషన్ అమెరికా

07 వాల్ట్ డిస్నీ అమెరికా

08 మౌటయ్ చైనా

09 టీఎస్ఎమ్ సీ తైవాన్

10 ఐహెచ్ సీ యూఏఈ