2009, 17 తర్వాత మరోసారి... షేర్ హోల్డర్స్ కు రిలయన్స్ గుడ్ న్యూస్!
ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం) లో కీలక నిర్ణయాలు ప్రకటించారు.
By: Tupaki Desk | 29 Aug 2024 12:32 PM GMTముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం) లో కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈ సందర్భంగా వాటాదారులకు రిలయన్స్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా షేర్ హోల్డర్స్ కు 1:1 నిష్పత్తిలో బోనస్ వాటాలు ఇచ్చే ప్రతిపాదనను ఆమొదించేందుకు కంపెనీ బోర్డు సెప్టెంబర్ 5న సమావేశం కానుంది.
అవును... వాటాదారులకు రిలయన్స్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా... వాటదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ వాటాలు ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించేందుకు కంపెనీ బోర్డు సమావేశం కానుంది. ఈ విషయాలు బీ.ఎస్.ఈ. ఫైలింగ్ లో పేర్కొంది.
సెబీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 5న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరగనుందని.. ఈ సమావేశంలో వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చే అంశాన్ని పరిశీలించి ఆమోదించనుందని సదరు ఫైలింగ్ లో ప్రస్థావించింది. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ఏజీఎంలో కంపెనీ ఛైర్మన్ ముకేష్ అంబానీ ధృవీకరించారు.
ఇక ఈ సమావేశంలోనే వారసులకు కంపెనీల బాధ్యతలు అప్పగించారు ముకేష్ అంబానీ. ఇందులో భాగంగా.. ఆకాష్ కు జియో, ఇషాకు రిటైల్, అనంత్ కి న్యూ ఎనర్జీ బిజినెస్ లు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రిలయన్స్ గ్రూప్ నకు ఛైర్మన్ గా మరో ఐదేళ్ల పాటు ముకేష్ అంబానీ కొనసాగనున్నారు.
మరోవైపు డిస్నీ హాట్ స్టార్ ఇండియా, జియో విలీనం కూడా పూర్తయ్యింది. ఫలితంగా... రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర గురువారం 2శాతం పెరిగింది. ఇందులో భాగంగా... రూ.3007 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటల సమయానికి రూ.3049 వరకూ వెళ్లింది. ఒక దశలో రూ.3065కూ చేరుకొంది.
కాగా... గతంలో కూడా రిలయన్స్ బోనస్ షేర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా... 2009, 2017 సంవత్సరాల్లోనూ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈ మేరకు షేర్ హోల్డర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.