పదేళ్ల ప్రస్టేషనులో రేణుకా చౌదరి.. రాజ్యసభలో ఏం చేశారంటే..
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, తెలుగు వారి ఐరెన్ లేడీ రేణుకా చౌదరి చాలా కాలం తర్వాత గొంతెత్తారు.
By: Tupaki Desk | 6 Feb 2025 4:56 PM GMTతెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, తెలుగు వారి ఐరెన్ లేడీ రేణుకా చౌదరి చాలా కాలం తర్వాత గొంతెత్తారు. పదేళ్ల పాటు చట్టసభలకు దూరంగా ఉన్న రేణుకా చౌదరి ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆమె రాజ్యసభలో అడుగుపెట్టి దాదాపు ఏడాది అవుతున్నా, ఎప్పుడూ లేనంతలా రాజ్యసభలో విరుచుకుపడ్డారు. పదేళ్ల నుంచి తెలుగు వారి గొంతునొక్కుతున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేశారు. పనిలో పనిగా చంద్రబాబు ప్రభుత్వంపైనా ఆమె విమర్శల దాడి చేశారు.
తెలంగాణ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా రేణుకా చౌదరికి పేరు. ఆమె గళం విప్పారంటే ప్రత్యర్థులు అన్నీ మూసుకోవాల్సిందేనంటారు. అలాంటి రేణుకా చౌదరి రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్ అయిపోవాల్సివచ్చింది. కాంగ్రెస్ వీక్ అవ్వడం, తనకు పదవి లేకపోవడంతో ఆమె మాటలకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తన పదేళ్ల ప్రస్టేషన్ అంతా తీర్చుకునేలా రేణుకా చౌదరి విరుచుకుపడుతున్నారు.
రాష్ట్ర విభజన హామీలు అమలుకు ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం లేదని నిన్న రాజ్యసభలో ధ్వజమెత్తారు. ఇటు తెలంగాణ, అటు ఏపీతో పాటు తన సొంత ప్రాంతం ఖమ్మం సమస్యలపైనా రాజ్యసభలో ఏకరువు పెట్టారు రేణుకా చౌదరి. పనిలో పనిగా విభజన హామీలు నెరవేర్చని మోదీకి మద్దతు ఇస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు పైనా సెటైర్లు వేశారు. చాలా కాలం తర్వాత రేణుకా చౌదరి వైలంట్ టాక్ చూసిన వారు ఫైర్ బ్రాండ్ కమింగ్ బ్యాక్ అంటూ చర్చించుకుంటున్నారు.