Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కే టీడీపీ మద్దతు..బాబుని ఇరకాటంలో పెట్టిన లేడీ ఫైర్ బ్రాండ్ ...!

తెలంగాణా కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి తెలుగుదేశం పార్టీ గురించి పొగుడుతూ ఒక విధంగా ఇరకాటంలోకి నెట్టేశారు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 5:28 PM GMT
కాంగ్రెస్ కే  టీడీపీ  మద్దతు..బాబుని ఇరకాటంలో పెట్టిన లేడీ ఫైర్ బ్రాండ్ ...!
X

తెలంగాణా కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి తెలుగుదేశం పార్టీ గురించి పొగుడుతూ ఒక విధంగా ఇరకాటంలోకి నెట్టేశారు. తెలంగాణాలో పోటీ చేయకుండా టీడీపీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం ఆనందకరం అని ఆమె చెప్పారు. ఖమ్మంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రేణుకా చౌదరి చేసిన ఈ కామెంట్స్ టీడీపీ అధినాయకత్వం ఎలా తీసుకుంటుందో తెలియదు కానీ టీడీపీ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చింది అని చెప్పడం ద్వారా తెలంగాణాలో అయితే వ్యూహం కరెక్ట్ గా పండింది అనుకోవచ్చు.

ఏపీలో అలా కుదురుతుందా అన్నదే చర్చ. మరి చంద్రబాబు నుంచి అయితే కాంగ్రెస్ కే మా పార్టీ మద్దతు అన్న ప్రకటన రాలేదు. కానీ కాంగ్రెస్ నేతలు అతి ఉత్సాహంతో అలా ప్రకటిస్తున్నారు. నిన్నటికి నిన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీడీపీకి ధన్యవాదాలు తెలియచేస్తే ఇపుడు రేణుకా చౌదరి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.

అయితే టీడీపీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. 2018లో తెలంగాణలో కాంగ్రెస్ తో కలసి పోటీ చేయడం వల్లనే ఏపీలో కూడా టీడీపీ దెబ్బ తింది అన్న మాట ఉంది. ఇపుడు కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చినా ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు టీడీపీ పెట్టుకుంటుందా అన్నది కూడా ఆలోచించాలి. అలా చేస్తే కనుక ఏపీ జనాలు హర్షిస్తారా. రెండు పార్టీలకు సానుకూలంగా ఓటు వేస్తారా అన్నది చూడాలని అంటున్నారు.

అయితే తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ పరిణామాలు ఏపీలో కూడా మారుతాయని అంటున్నారు. ఏపీలో కూడా కాంగ్రెస్ జోష్ పెంచుకుంటుందని, ఎంతో మంది నేతలు తిరిగి కాంగ్రెస్ వైపు వస్తారని అంటున్నారు. బాబు నుంచి కూడా ఇండియా కూటమిలో చేరే ప్రతిపాదన వచ్చినా రావచ్చు అని అంటున్నారు. అదే జరిగితే సంచలన పరిణామంగానే చూడాలని అంటున్నారు.

ఇదిలా ఉండగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తాను అని రేణుకా చౌదరి అంటున్నారు. ఆమె నిజంగా ఆ మాట అంటున్నారా అన్నది కూడా చూడాల్సి ఉంది. తనను ఏపీలో పోటీ చేమని చాలా మంది ఆహ్వానిస్తున్నారు అని ఆమె అన్నారు. ఏపీ సీఎం ఒక బలమైన సామాజికవర్గానికి వ్యతిరేకి అని రేణుక జగన్ మీద హాట్ కామెంట్స్ చేశారు.

అంతే కాదు, చంద్రబాబుని అరెస్ట్ చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. అసలు చంద్రబాబుని అరెస్ట్ చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ కి పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తుందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కావాలని ప్రతీ వారూ కోరుకోవడంలో తప్పు లేదని కానీ కర్నాటకలో డీకే శివ కుమార్ ని చూసి త్యాగ గుణం కూడా నేర్చుకోవాలని ఆమె సూచించారు.

మరి ఆమె ఈ సూచనలు ఎవరిని ఉద్దేశించి చేశారు అన్నది కూడా తెలియదు. మొత్తానికి రేణుకా చౌదరి చంద్రబాబుని టీడీపీని పొగుడుతున్నారు. మరి టీడీపీ రియాక్షన్ ఏంటి అన్నడి డిసెంబర్ 3 తరువాతనే చూడాల్సి ఉంటుంది.