Begin typing your search above and press return to search.

రూ.7 వేల కోట్లు .. 2 వేల నోట్లు !

కొత్త నోట్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్లను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   2 July 2024 4:15 AM GMT
రూ.7 వేల కోట్లు .. 2 వేల నోట్లు !
X

కొత్త నోట్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్లను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గత ఏడాది 2023 మే 19న చలామణి నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఆర్బీఐ ముద్రించి మార్కెట్లోకి వదిలిన రూ.2 వేల నోట్లలో దాదాపు 97.87 శాతం మేర తిరిగి వెనక్కు వచ్చాయి.

ఇంకా రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌ 7 దాకా దేశంలోని అన్ని బ్యాంక్‌ శాఖలలో రూ.2,000 నోట్ల మార్పిడి జరిగింది. రూ.2 వేల నోటును ప్రవేశ పెట్టిన ఏడేళ్లకే దాని చలామణిని ఆర్బీఐ నిలిపివేసింది.

మార్కెట్లోకి తెచ్చిన రూ.2 వేల నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు. అయితే హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ఇప్పటికీ రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం ఉందని, ఈ నోట్లు ఇంకా ఎవరి దగ్గరైనా ఉంటే అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ శాఖల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది.