Begin typing your search above and press return to search.

ల్యాప్ టాప్ .. ట్యాబ్లెట్ల దిగుమతులపై ఆంక్షలు.. ఎప్పటినుంచి?

ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు (హెచ్ పీ, డెల్, యాపిల్, లెనోవో, శాంసంగ్) దేశీయంగా ఉత్పత్తి మీద ఫోకస్ పెట్టే వీలుందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   20 Oct 2024 1:30 PM GMT
ల్యాప్ టాప్ .. ట్యాబ్లెట్ల దిగుమతులపై ఆంక్షలు.. ఎప్పటినుంచి?
X

అంతంతకూ పెరుగుతున్న ల్యాప్ టాప్ లు.. ట్యాబ్లెట్ల వినియోగానికి తగ్గట్లు దేశీయంగా ఉత్పత్తి కంటే దిగుమతి మీదనే మనం ఆధారపడుతున్న పరిస్థితి. దేశీయంగా 15 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంటే.. కేవలం ఐదు బిలియన్ డాలర్లకు మాత్రమే సొంతంగా తయారుచేస్తుంటే.. మిగిలిన 10 బిలియన్ డాలర్ల మార్కెట్ కు అవసరమైన ఉత్పత్తులు మొత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి. ఈ తీరుకు చెక్ పెట్టేందుకు 2025 జనవరి తర్వాత దిగుమతులపై ఆంక్షలు పెట్టే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దిగుమతులపై ఆంక్షలు పెడితే.. యాపిల్ అగ్రశ్రేణి లాంటి కంపెనీలు భారత్ లో తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయటం ఖాయమని చెబుతున్నారు. కంప్యూటర్ల దిగుమతిపై ప్రభుత్వం పరిమితి పెడితే.. దాదాపు రూ.84వేల కోట్ల మేర ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

నిజానికి ల్యాప్ టాప్ లు.. ట్యాబ్లెట్ల దిగుమతులపై ఆంక్షలు విధించాలని భావించినా.. అమెరికా కంపెనీల నుంచి బలమైన ఒత్తిడి రావటంతో ఆ దిశగా నిర్ణయాన్ని తీసుకున్నది లేదు. అందుకే.. తొలుత తగిన సమయం ఇచ్చిన తర్వాత.. అప్పటికి పరిశ్రమలు దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ఫోకస్ పెట్టకుంటే.. దిగుమతులపై ఆంక్షల వైనాన్ని తీవ్రం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాప్ టాప్ దిగుమతుల తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ గడువు ఈ ఏడాది చివరికి ముగియనుంది. వచ్చే ఏడాది నుంచి దిగుమతులు చేసుకోవటానికి మళ్లీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు (హెచ్ పీ, డెల్, యాపిల్, లెనోవో, శాంసంగ్) దేశీయంగా ఉత్పత్తి మీద ఫోకస్ పెట్టే వీలుందని చెబుతున్నారు. దేశీయంగా ఉన్న గిరాకీలో రెండు వంతులు బయట దేశాల నుంచే వస్తున్నాయి. వీటిలో అత్యధికం చైనా నుంచే వస్తున్న పరిస్థితి. దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ.. ల్యాప్ టాప్ లు.. కంప్యూటర్ల తయారీ కోసం అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న డిక్సన్ టెక్నాలజీస్ వంటి కంపెనీలకు ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.

దేశీయంగా హార్డ్ వేర్ ఉత్పత్తిని పెంచేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దిగుమతులపై ఆంక్షలు విధించటం ద్వారా నాణ్యత లేని పరికరాలు దేశంలోకి రాకుండా చూడొచ్చు. మరి. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎంత గట్టిగా ఉంటుందన్నది అసలు ప్రశ్న. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయక తప్పదు.