Begin typing your search above and press return to search.

రిటైల్ రంగంలో భారీగా ఉద్యోగుల తొలగింపు... షాకింగ్ రీజన్!

ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ టెక్ కంపెనీలు సైతం వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Aug 2024 11:30 AM GMT
రిటైల్  రంగంలో భారీగా ఉద్యోగుల తొలగింపు... షాకింగ్  రీజన్!
X

ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ టెక్ కంపెనీలు సైతం వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఆర్థిక మాద్యానికి సంకేతం అని.. పలు దిగ్గజ కంపెనీల ముందు జాగ్రత్తలో భాగమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగంగా చెప్పే రిటైల్ లో తాజాగా భారీ కోత తెరపైకి వచ్చింది!

అవును... పలు రిటైల్ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ మేరకు ఎఫ్.వై. 2024లో సుమారు 12 లైఫ్ స్టైల్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్, గ్రాసరీ సుమారు 26,000 మంది ఉద్యోగులను తొలగించాయని తెలుస్తోంది. ఐదు ప్రధాన రిటైలర్ లచే నడపడుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్, టైటాన్, రేమండ్, ఫేజ్, స్పెన్సర్స్ లలో ఈ కోత భారీగా ఉందని అంటున్నారు.

వాస్తవానికి పైన పేర్కొన్న ఐదు ప్రధాన రిటైలర్లతో నడపబడుతున్న వాటిలో మొత్తం వర్క్ ఫోర్స్ 2023 ఆర్థిక సంవత్సరంలో 4,55,000 ఉండగా... 2024 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి ఆ సంఖ్య 4,29,000కి తగ్గింది. అంటే 26,000 మంది ఉద్యోగులను ఈ రిటైలర్ కంపెనీలు తొలగించాయి! వీరిలో టెంపరరీ ఉద్యోగులతో పాటు పర్మినెంట్ ఉద్యోగులూ ఉన్నారని అంటున్నారు.

తాజాగా ఈ వ్యవహారాలపై స్పందించిన రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కుమార్ రాజగోపాలన్... ప్రతిభ కొరత ఉండి ఉండొచ్చని, పలు యూనివర్శిటీలతో టైఅప్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, తద్వారా పరిశ్రమకు ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని.. అయితే కొన్ని షాప్స్ ని మూసివేయడం వల్ల కంపెనీలు సిబ్బందిని తగ్గించి ఉండొచ్చని అన్నారు.

ఇక 2022 దీపావళి నుంచి వినియోగదారులు దుస్తులు, లైఫ్ స్టైల్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, బయట భోజనాలు వంటి ఖర్చులను తగ్గించుకుంటున్నారని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుని ఉంటాయని అంటున్నారు. ఇదే సమయంలో ఐటీ వంటి రంగల్లో ఉద్యోగ నష్టాలు, సాధారణ ఆర్థిక మందగమనం వంటివి కూడా ఈ మార్పుకు కారణాలని చెబుతున్నారు.