Begin typing your search above and press return to search.

బాబుపై కథనం .. పొంగిపోతున్న తమ్ముళ్లు !

చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారని, ప్రఖ్యాత టైం మ్యాగజైన్ 'సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్'గా అవార్డును చంద్రబాబుకు అందించిందని గుర్తుచేసింది.

By:  Tupaki Desk   |   7 Jun 2024 8:43 AM GMT
బాబుపై కథనం .. పొంగిపోతున్న తమ్ముళ్లు !
X

'' మొదటిసారి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సీఎంగా కాకుండా 'సీఈవో'గా పేరు పొందారు. ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన చంద్రబాబు పాలన 1990లలోనే కార్పోరేట్ స్టయిల్ లో ఉండేది. ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉండేది.

నిజాం నగరం హైదరాబాద్‌ను నవభారతంలో సైబర్ హబ్‌గా మార్చేశారు. హైటెక్ సిటీ, ఐటీ, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ వంటి వాటితో సైబరాబాద్‌గా మార్చేశారు. హైటెక్ సిటీ హైటెక్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా మారింది. బిల్‌గేట్స్‌ను హైదరాబాద్ రప్పించి ప్రపంచం మొత్తం ఇటువైపు చూసేలా చేశారు'' అంటూ ఇండియాటుడే చంద్రబాబు మీద ప్రశంసలు కురిపిస్తూ ప్రసారం చేసిన ఓ కథనం తెలుగు తమ్ముళ్లను విపరీతంగా ఆకర్షిస్తున్నది.

ఏపీలో బీజేపీ, జనసేనలతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ 16 లోక్ సభ స్థానాలు సాధించి కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు. 135 శాసనసభ స్థానాలు సొంతంగా, 21 జనసేన, 8 బీజేపీ స్థానాలతో కలిపి 175 స్థానాలకు గాను ఏకంగా 164 స్థానాలతో ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇండియాటుడే ఈ కథనం ప్రసారం చేసింది.

చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారని, ప్రఖ్యాత టైం మ్యాగజైన్ 'సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్'గా అవార్డును చంద్రబాబుకు అందించిందని గుర్తుచేసింది. నేడు భారతదేశంలో హైటెక్ సిటీ ఐటీ, బయో, హెల్త్, ఇంజినీరింగ్ హబ్‌గా మారిందని, ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని, వైఎస్ జగన్ అధికారంలోకి రావడంతో అవన్నీ ఆగిపోయాయని వెల్లడించింది. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పాత పనులను చేపట్టి పూర్తి చేసే అవకాశం ఉందని కథనంలో పేర్కొంది.