Begin typing your search above and press return to search.

రాహుల్ తో 'గ్యాప్' చేతలతో తేల్చేసిన సీఎం రేవంత్

అంటే.. దానికి తగ్గట్లే కారణాల్నిచూపించటం..లాజిక్ కు సరిపోయేలా పరిణామాల్ని చూపించటం చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   16 Feb 2025 5:34 AM GMT
రాహుల్ తో గ్యాప్ చేతలతో తేల్చేసిన సీఎం రేవంత్
X

కొన్నిసార్లు కొన్ని అంశాల మీద జరిగే ప్రచారం వాస్తవానికి భిన్నంగా ఉంటుంది. అయితే.. అప్పటి వరకు జరిగిన ప్రచారాన్ని ఎందుకు నమ్మినట్లు? అంటే.. ఆ ప్రచారం చేసే వారి టాలెంట్ అంతలా ఉంటుందని చెప్పాలి. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్యాప్ ఉందన్న మాట పెద్ద ఎత్తున ప్రచారం జరగటం తెలిసిందే. ఇలాంటి మాటల్ని ఎందుకు నమ్ముతారు? అంటే.. దానికి తగ్గట్లే కారణాల్నిచూపించటం..లాజిక్ కు సరిపోయేలా పరిణామాల్ని చూపించటం చేస్తుంటారు.

రాహుల్ తో టర్మ్స్ బాగుండి ఉంటే.. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీనికి ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు కలవనట్లు? అంటూ ప్రశ్నలు రావటం.. మిగిలిన వారంతా తరచూ కలిస్తుంటే.. ముఖ్యమంత్రిమాత్రం ఎందుకు కలవట్లేదు? అంటూ లాపాయింట్ తీసినోళ్లు ఉన్నారు. ఇది సరిపోనట్లుగా చాలానే వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి వాటి విషయాల్ని ఇటీవల వరకు పెద్దగా పట్టించుకోని సీఎం రేవంత్.. తాజాగా తన చేతలతో చేసి చూపించటం ద్వారా.. సందేహాల చూపులకు చెక్ పెట్టేశారని చెప్పాలి. తాజా ఢిల్లీ పర్యటన సందర్భంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వీరి భేటీ దాదాపు గంటకు పైనే సాగింది. అనంతరం.. మీడియాతో మాట్లాడిన రేవంత్.. తనకు రాహుల్ గాంధీకి మధ్య ఉన్న గ్యాప్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం.. వివరణ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

‘‘రాహుల్ గాంధీకి నాకు మధ్య గ్యాప్ ఉందన్నది కేవలం ప్రచారం మాత్రమే. ఆయన ఎజెండా అమలు చేయడమే నా బాధ్యత. జనం స్వయంగా చెప్పిన వివరాలే కులగణనలో నమోదయ్యాయి. అందులో ఒక్క తప్పున్నా చూపించమని సవాలు విసురుతున్నా. సర్వే విషయంలో రాహుల్ గాంధీ చెప్పినట్లే నడుచుకున్నా’’ అంటూ చెప్పటం ద్వారా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ లెంగ్త్ లో చెక్ చెప్పేశారని చెప్పాలి. ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. నిజంగానే సీఎం రేవంత్ కు.. రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉంటే.. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఊరికే ఉంటారా. తమ అసమ్మతి రాగాలతో ముఖ్యమంత్రికి చుక్కలు చూపించకుండా ఉంటారా చెప్పండి?