'మహారాష్ట్రలో బీజేపీ ఓటమి ఖాయం.. అందుకే ప్రధాని పారిపోయారు'
మహారాష్ట్రలో కాంగ్రెస్‌పార్టీ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి విజయం దక్కించుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 18 Nov 2024 8:16 AM GMTమహారాష్ట్రలో కాంగ్రెస్‌పార్టీ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి విజయం దక్కించుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి పట్ల మహారాష్ట్ర ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు.
ఇప్పుడు మహాయుతిని మట్టుబెట్టేందుకు మహారాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారని రేవంత్ చెప్పారు. ఈ విషయం తెలుసు కాబట్టే.. బీజేపీ ఓటమి ఖాయమని నిర్ణయించుకున్నారు కాబట్టే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశాలకు పారిపోయారని(విదేశీ పర్యటనకు వెళ్లారు) రేవంత్ నిప్పులు చెరిగారు. బీజేపీ సహా ప్రధాని మోదీ మహారాష్ట్రలో ఓటమిని ముందుగానే అంగీకరించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు విభజన రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
ఆసాంతం హిందీలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి ప్రధాని సహా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. మూడే ళ్ల మహాయుతి పాలనలో మహారాష్ట్రలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదన్నారు. చెప్పుకొనేందుకు ఏమీ లేక.. కాంగ్రెస్ కూటమి మహావికాస్ అఘాడీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విభజిత రాజ కీయాల ద్వారా లబ్ధి పొందాలని చూసే మోడీ ఆయన పరివారానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు.
కానీ, 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర శాసన సభకు.. ఈ నెల 20న ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటములు ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడుతున్నాయి. ఇరు పక్షాలు వారి వారి ముఖ్యమంత్రులను అగ్ర నాయకులను రంగంలోకి దింపి ప్రచారం సాగిస్తున్నాయి.