హరీష్ రావును రేవంత్ రెడ్డి అభినందించిన సందర్భం వైరల్!
ఇందులో భాగంగా... ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై విచారణ జరపాలని హరీశ్ రావు కోరటం అభినందనీయమని అన్నారు.
By: Tupaki Desk | 20 Dec 2024 2:30 AM GMTఔటర్ రింగ్ రోడ్ (ఓ.ఆర్.ఆర్.) టెండర్ల పై చాలా కాలంగా చర్చ జరుగుతోందని.. ఈ వ్యవహారంలో కొంతమందికి లబ్ధి చేకూర్చడానికే టెండర్లు కట్టబెట్టారనే ఆరోపణలు ఇటీవల బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో గురువారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా హరీష్ ను రేవంత్ అభినందించారు.
అవును... ఔటర్ రింగ్ రోడ్డును అప్పనంగా ఎవరికో అప్పగించారని.. టెండర్లపై విచారణ జరిపించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటూ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా సిట్ తో సమగ్ర దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై విచారణ జరపాలని హరీశ్ రావు కోరటం అభినందనీయమని అన్నారు. దీంతో... సిట్ విచారణను స్వాగతిస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నేడు అంతర్జాతీయ స్థాయి నగరంగా రాణించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను వివరించారు.
ఇందులో భాగంగా.. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రాణించడానికి కారణం.. కృష్ణా-గోదావరి నదీ జలాలు, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, మెట్రో రైల్, ఫార్మా కంపెనీలు, శాంతి భద్రతలను కాపాడంతోపాటు మత సామరస్యాని పెందించడం అని.. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతుందంటే కారణం కాంగ్రెస్ అని అన్నారు.
ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు, శమ్షాబాద్ ఎయిర్ పోర్టు వల్ల రాష్ట్ర ఆదాయం పెరిగిందని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయిందని అన్నారు. అయితే... ఎన్నికల ముంగిట ఔటర్ రింగ్ రోడ్ ను 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వటంపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరిగిందని రేవంత్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు లీజు టెండర్లపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే... ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై విచారణ జరపాలని హరీశ్ రావు కోరటం అభినందనీయమని సీఎం అన్నారు.