మన్మోహన్‌కు భారత రత్న ఇవ్వాల్సిందే: రేవంత్ పట్టు
'' పేదల నాయకుడిగా.. దేశ ఆర్థిక వ్యవస్థను మలుపుతిప్పిన మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలి. ఇచ్చి తీరాలి.
By: Tupaki Desk | 30 Dec 2024 2:25 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్ చేశారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ భేటీ అయింది. కేవలం మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించడం.. సంతాప తీర్మానం చేయడం వంటి రెండే అజెండాలతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. సోమవారం ఒక్కరోజు మాత్రమే ఈ సభ జరగనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్ గొప్పతనాన్ని ఏకరువు పెట్టారు.
'' పేదల నాయకుడిగా.. దేశ ఆర్థిక వ్యవస్థను మలుపుతిప్పిన మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలి. ఇచ్చి తీరాలి. ఈ మేరకు ఈ సభ(అసెంబ్లీ) తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించాలి'' అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన వ్యక్తిగా మాజీ ప్రధానిని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా మన్మోహన్ పాలనా కాలంలో తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టం గురించి చాలా సేపు వివరించారు. దీనివల్ల గ్రామీణులకు ఉపాధి లభించి.. మూడు పూటలా అన్నం తినగలుగుతున్నారని చెప్పారు.
అదేవిధంగా ఆర్థిక సరళీకరణ విధానాలను తీసుకురావడం వల్లే.. నేడు అనేక సంస్థలు.. విదేశాల నుంచి మన దేశానికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నాయని, దీనివల్లప్రభుత్వాలకు ఆదాయం.. నిరుద్యోగుల కు ఉద్యోగాలు, అనేక వర్గాలకు ఉపాధి కూడా లభిస్తోందని రేవంత్‌రెడ్డి వివరించారు. ''ప్రధానిగా మన్మో హన్ ఆనాడు తీసుకున్న నిర్ణయాలు ఏ ప్రభుత్వమైనా పాటిస్తోంది. పాటించేలా ఆయన వ్యవహరించా రు.'' అని రేవంత్ చెప్పుకొచ్చారు. ఆయన స్మృతికి చిహ్నంగా 'భారత రత్న' ఒక్కటే సరితూగగల పురస్కారమని వెల్లడించారు.