Begin typing your search above and press return to search.

డిమాండ్ 12 ల‌క్ష‌లు.. ఇస్తోంది ల‌క్ష‌.. రేవంత్ దొరికిపొతున్నారే!

ప్ర‌స్తుతం ల‌క్ష కార్డుల‌కు మాత్ర‌మే రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వాస్త‌వానికి రేవం త్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ప్రారంభంలోనే 16,900 కార్డులు పంపిణీ చేశారు.

By:  Tupaki Desk   |   23 Feb 2025 3:30 PM GMT
డిమాండ్ 12 ల‌క్ష‌లు.. ఇస్తోంది ల‌క్ష‌.. రేవంత్ దొరికిపొతున్నారే!
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మ‌రోసారి వివాదంలో చిక్కుకునేలా ఉన్నార‌ని అంటున్నారు పొలి టిక‌ల్‌ ప‌రిశీల‌కులు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేష‌న్ కార్డుల‌కు ప్ర‌భుత్వం తెర‌దీసింది. ల‌బ్ధిదారులై ఉండి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు రేష‌న్ కార్డు లేని వారికి రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది. గ‌త నాలుగు మాసాల ముందు నుంచి కూడా దీనిపై క‌స‌ర‌త్తు చేసి రేష‌న్ కార్డుల కోసం ద‌ర‌ఖాస్తులు తీసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 ల‌క్ష‌ల‌కు పైగానే ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

కానీ.. ప్ర‌స్తుతం ల‌క్ష కార్డుల‌కు మాత్ర‌మే రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వాస్త‌వానికి రేవం త్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ప్రారంభంలోనే 16,900 కార్డులు పంపిణీ చేశారు. ఆ త‌ర్వా త మరింతగా రేష‌న్ కార్డుల కోసం డిమాండ్లు పెరిగాయి. దీంతో రాష్ట్ర స్థాయిలో రేష‌న్ కార్డుల కోసం ద‌ర ఖాస్తులు వెల్లువెత్తాయి. ఇలా మొత్తంగా 12 ల‌క్షల‌కు పైగానే ద‌ర‌ఖాస్తులు అందాయి. కానీ, వీటిలో కేవ‌లం ల‌క్ష కార్డుల‌కే ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.

ఈ కార్డుల‌ను మార్చి 1న హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పంపిణీ చేయ‌నున్నా రు. నూతన రేషన్‌కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో, ప్రజావాణిలో, మీ-సేవా వెబ్‌సైట్‌ నుంచి, కుల గణన సర్వేలో విజ్ఞాపనలు అందడంతో ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంల కేవ‌లం ల‌క్ష కార్డుల‌నే పంపిణీ చేయ‌డం వివాదాల‌కు తావిస్తోంది. ఆయా జిల్లాల్లో ప్ర‌జ‌లు స‌ర్కారుపై ర‌గులుతున్న ప‌రిస్థితి నెల‌కొంది. దీనిని స‌రిపుచ్చడం అంత తేలిక కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది.

1న అందేవి ఈ జిల్లాల వారికే!

+ వికారాబాద్‌లో 22 వేలు

+ నాగర్‌కర్నూల్‌లో 15 వేలు

+ వనపర్తిలో 6 వేలు

+ నారాయణపేటలో 12 వేలు

+ మహబూబ్‌నగర్‌లో 13 వేలు

+ గద్వాలలో 13 వేలు

+ మేడ్చల్‌లో 6 వేలు

+ రంగారెడ్డిలో 24 వేల మందికి ఇవ్వ‌నున్నారు.