Begin typing your search above and press return to search.

రేవంత్ కు పాత జ్ఞాపకాలు ఎక్కువే.. తాజాగా ఏం చేశారంటే?

ఈ సందర్భంగా ఆయన అందరూ ఆశ్చర్యపోయే పని ఒకటి చేశారు. తాను చదువుకునే రోజుల్లో అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   3 March 2025 11:38 AM IST
రేవంత్ కు పాత జ్ఞాపకాలు ఎక్కువే.. తాజాగా ఏం చేశారంటే?
X

అత్యుత్తమ స్థాయికి చేరుకున్న తర్వాత చాలామంది తమ గతాన్ని మర్చిపోతారు. ఆ మాటకు వస్తే వదిలేస్తారని చెబుతారు. తాము పడిన కష్టాల్ని.. ఆ సందర్భంగా తమ వెంట ఉన్న వారిని గుర్తు చేసుకోవటానికి పెద్దగా ఇష్టపడరు. అందుకు భిన్నంగా కొందరు మాత్రం స్పెషల్ గా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరతారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన వనపర్తిలో పర్యటించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన అందరూ ఆశ్చర్యపోయే పని ఒకటి చేశారు. తాను చదువుకునే రోజుల్లో అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ తమ ఇంటికి రావటంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన వారు.. ఎంతో అప్యాయంగా హారతులు ఇచ్చి మరీ రేవంత్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్.

ఈ సందర్భంగా వారు చేసి పెట్టిన పూరీలు తింటూ వారితో సరదాగా గడిపారు. వారితో ఫోటోలు దిగారు. ఇది బ్లడ్ రిలేషన్ కాదు కానీ అంతకు మించిన అనుబంధమన్న రేవంత్.. ‘‘వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తూ అనాడు అక్క ఇంట్లో ఆత్మీయతను అస్వాదిస్తూ పెరిగా. ఆ జ్ఞాపకాలను మోసుకొని ముఖ్యమంత్రిగా అక్క ఇంటికి వెళ్లా’’ అంటూ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ చేసిన పనిని పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా వనపర్తిలో తనతో కలిసి చదువుకున్న స్నేహితులతోనూ రేవంత్ కాసేపు గడిపారు. వారితో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి.. పాత జ్ఞాపకాల్ని గర్తు చేసుకున్నారు. జీవితంలో నడిచి వచ్చిన దారిని.. పాత స్నేహితుల్ని మర్చిపోకపోవటం అభినందించాల్సిన అంశంగా చెప్పకతప్పదు.