Begin typing your search above and press return to search.

హైడ్రాను అలా అమలు చేస్తే ఎలా ఉంటుంది రేవంత్ సాబ్?

హైడ్రా కూల్చివేతల విషయంపై సర్వత్రా ఆసక్తితో పాటు.. ఉత్కంటను గురి చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   10 Sep 2024 7:30 AM GMT
హైడ్రాను అలా అమలు చేస్తే ఎలా ఉంటుంది రేవంత్ సాబ్?
X

హైడ్రా కూల్చివేతల విషయంపై సర్వత్రా ఆసక్తితో పాటు.. ఉత్కంటను గురి చేస్తున్నాయి. తర్వాత ఎవరు? ఏ చెరువు మీద ఫోకస్ చేస్తున్నారు? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఒకటి తర్వాత ఒకటి చొప్పున కూల్చివేతల ప్రక్రియ సాగుతున్న వేళ.. హైడ్రామా నెలకొని ఉండటం చూస్తున్నదే. కోట్లాది రూపాయిల ఆస్తుల్ని బుల్డోజర్లతో కూల్చేసిన వైనం చూసినప్పుడు.. ఇలాంటి ఆస్తుల్ని ఈ తరహాలో ధ్వంసం చేయటం సబబేనా? అన్నది ప్రశ్నగా మారింది.

ఆస్తుల ధ్వంసం ఒక ఎత్తు అయితే.. వాటి యజమానుల పరిస్థితేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సంపన్నులు.. బడాబాబుల సంగతి సరే.కానీ.. పేదలు, దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వారిదే అసలు సమస్య. వారి సర్వసాన్ని ఆస్తులు కొనేందుకు న. ఇవాల్టి రోజున హైడ్రా వచ్చి.. అక్రమ కట్టడంగా.. చెరువు ప్రాంతంలో కట్టావని చెప్పేసి.. ఆస్తుల్ని ధ్వంసం చేయటం ద్వారా వారి జీవిత ఆదాయాలు ధ్వంసమై.. శిధిలాల కుప్పగా మారుతున్నాయి.

ఇదంతా మంచిదేనా? అన్నది బాధితుల ప్రశ్న. మరి.. చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాలంటే.. ఇలాంటి కొన్ని కష్టాల్ని ఎదుర్కోవాల్సిందే అని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చు. కానీ.. అదేమీ అంత తేలికైనది కాదు. దీనికి చేయాల్సిదంతా.. ఇప్పుడున్న విధానాలకు కొన్ని మార్పుల్ని తక్షణం చేయాల్సి ఉంది. ఎక్కడైతే కూల్చివేతలు జరపాలని డిసైడ్ చేస్తారో అక్కడి వారి నివాసాల్ని ఖాళీ చేయించటం.. సదరు కట్టడాల్ని ధ్వంసం చేయటానికి ముందే.. వారికి ఆస్తుల మార్కెట్ విలువలో సగానికి పైగా పరిహారాన్ని.. కొంత మొత్తాన్ని బాండ్ల రూపంలో అందజేయాలి. అంతేకాదు.. ఒకవేళ నిరుపేదలు.. పేదల గుడిసెల్ని కూల్చేస్తున్నప్పుడు కూడా.. అలాంటి వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాల్సిన అవసరం ఉంది.

అంతేకాదు.. వారి ఆస్తుల్ని ధ్వంసం చేసే సమయంలో.. వారి సామాన్లకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అలా చేసినప్పుడు అక్రమ కట్టడాల్ని క్లియర్ చేసే వేళలో.. బాధితులకు పరిహారం లాంటిది అందించటం ద్వారా.. చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసే వీలుంది. మరి.. ఈ దిశగా రేవంత్ సర్కారు ఆలోచనలు చేస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. హైడ్రా మంచిదే. కానీ.. దాన్ని సమయానికి.. సందర్భానికి అనుగుణంగా వాడాలి. అంతే కాదు.. దూకుడు మంచిదే కాదు.. మోతాదు మించితే కూడా నష్టమేనన్న వాస్తవాన్ని రేవంత్ సర్కారుకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యతను ఎవరో ఒకరు తీసుకోవాల్సిందే. అప్పుడే మరింత ప్రయోజనకరంగా మారుతుంది. మరి.. సీఎం రేవంత్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.