Begin typing your search above and press return to search.

కేసీఆర్ శత్రువులని ఆయనకు దగ్గర చేస్తున్నావేంటి రేవంత్?

తాజాగా సొంత ఇలాకా అయిన వికారాబాద్ జిల్లా పరిధిలో కలెక్టర్ పై దాడి యత్నం తదుపరి పరిణామాలే దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.

By:  Tupaki Desk   |   13 Nov 2024 11:30 AM GMT
కేసీఆర్ శత్రువులని ఆయనకు దగ్గర చేస్తున్నావేంటి రేవంత్?
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విష‌యంలో...సమస్యలు ఆయ‌న‌ ముందుకు వచ్చి పడుతున్నాయా లేదా ఆయనే సమస్యలను కొని తెచ్చుకుంటున్నారా తెలియదు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది మాత్రం కాదని లేని నిజం. తాజాగా సొంత ఇలాకా అయిన వికారాబాద్ జిల్లా పరిధిలో కలెక్టర్ పై దాడి యత్నం తదుపరి పరిణామాలే దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ఫార్మా విలేజ్ లో ఏర్పాటుకు భూసేకరణ యత్నంలో స్థానిక ప్రజలు వ్యతిరేకించడం, ఈ క్రమంలోనే కలెక్టర్, అడిషిన‌ల్‌ కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులపై దాడి య‌త్నం జరగడం తీవ్ర సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. సహజంగానే ఇలాంటి అంశాలు రాజకీయంగా పరస్పర విమర్శలు ప్రతి విమర్శలకు వేదిక అవుతుంటాయి. అయితే, తాజా ఎపిసోడ్లో మాత్రం కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నీ ఒకటే గ‌లం వినిపిస్తుండడం ఆసక్తి కరం.

అధికారుల‌పై దాడి య‌త్నం విష‌యంలో... బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే, బీఆర్ఎస్ వారి ద్వారానే అధికారులపై దాడి య‌త్నం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే...దాన్ని బీఆర్ఎస్ ఖండిస్తోంది. త‌మ వైపు నుంచి కుట్ర కోణం లేద‌ని తేల్చిచెప్తోంది. తాజాగా బీజేపీ ఈ విష‌యంలో తోడైంది. ప్రజల వ్యతిరేకత ప్రతిఘటనకి ఇది నిదర్శనం అని బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత‌, స్థానిక ఎంపీ డీకే అరుణ‌ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఎంపీ డీకే అరుణ లగచర్ల ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదు అని తెలిపారు. ఫార్మా కంపెనీపై గ్రామాల్లో వ్యతిరేకత ఉందని పేర్కొంటూ, లగచర్ల ఘటనలో అన్ని పార్టీలకు మద్దతిచ్చే రైతులు ఉన్నారని తెలిపారు. ప్రజలు కాదంటుంటే ప్రభుత్వం ఎందుకు మొండిగా ముందుకు సాగుతుందని డీకే అరుణ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని చెప్పారు.

కాగా, ల‌గ‌చ‌ర్ల‌లో అధికారుల‌పై దాడి ఘ‌ట‌న బీఆర్ఎస్ వ‌ల్లేన‌ని పేర్కొంటూ వివాదాన్ని ఆ పార్టీ ఖాతాలోకి తోసేయాలని అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ పనిలో బిజీగా ఉండ‌గా... ఇప్పుడు బీజేపీ అందుకు విరుద్ధంగా మాట్లాడడంతో గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డ్డంత ప‌ని అయింది. అంతేకాకుండా, కేసీఆర్ అంటే ఒంటికాలి పై లేచిన నేతలు ఇప్పుడు ఆ పార్టీకి ఉపయోగపడేలా మాట్లాడడం రేవంత్ వాళ్ళ జరుగుతున్న పరిణామం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.