Begin typing your search above and press return to search.

బాబు నితీష్ లను ముగ్గులోకి లాగుతున్న రేవంత్ రెడ్డి

ఇలా సాగిన రాజకీయంలో తాను ఏమి నేర్చుకున్నానో మంచి విషయాలే ఆయన చెప్పడంలోనే ఆయన నాయకత్వ లక్షణాలు ఆయన సత్తా అందరికీ తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   13 Nov 2024 3:47 AM GMT
బాబు నితీష్ లను ముగ్గులోకి లాగుతున్న రేవంత్ రెడ్డి
X

మంచి మాటకారి తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనలో లౌక్యం పాలు కూడా ఎక్కువే. రేవంత్ రెడ్డి రాజకీయం కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆయన మొదట ఏబీవీపీలో ఉన్నారు. ఆ తరువాత టీడీపీ ఇపుడు కాంగ్రెస్. ఇలా సాగిన రాజకీయంలో తాను ఏమి నేర్చుకున్నానో మంచి విషయాలే ఆయన చెప్పడంలోనే ఆయన నాయకత్వ లక్షణాలు ఆయన సత్తా అందరికీ తెలుస్తోంది.

ఇవన్నీ ఆయన ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇంటర్వ్యూలో ఇలాంటి ముచ్చట్లు ఎన్నో చెప్పారు. తాను ఏబీవీపీలో దేశం పట్ల నిబద్ధతను నేర్చుకున్నానని టీడీపీలో ఉన్నపుడు అభివృద్ధి సంక్షేమం గురించి నేర్చుకున్నానని కాంగ్రెస్ లో సామాజిక న్యాయం గురించి నేర్చుకున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఇక దేశానికి కాంగ్రెస్ ప్రధాన మంత్రి ఎపుడు వస్తారు తదుపరి ప్రధాని రావడానికి ఎంత కాలం పడుతుందని అడిగిన మరో ప్రశ్నకు రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా జవాబు చెప్పడమే కాదు ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబుని అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్ ని ముగ్గులోకి లాగారు.

చంద్రబాబు నితీష్ కుమార్ లాంటి వారు ఉంటే ఏడాదిలోనే కాంగ్రెస్ నుంచి ప్రధాని వస్తారు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనం రేపుతున్నాయి. ఈ ఇద్దరూ మద్దతు ఇస్తే కాంగ్రెస్ దే అధికారం అన్నట్లుగా రేవంత్ చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

నిజంగా కాంగ్రెస్ కి చంద్రబాబు నితీష్ కుమార్ మద్దతు ఇస్తారా అలా ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి అన్నారని కాదు కానీ ఈ ఇద్దరే ఎన్డీయే కూటమికి ఊత కర్రలుగా

ఉన్నారు. బీజేపీకి సొంతంగా బలం లేదు అధికారంలోకి రావడానికి. అలాగే అధికారం నుంచి దిగిపోవాలన్నా ఈ రెండు పార్టీలు నో సపోర్ట్ అన్న ఒక్క మాట అంటే చాలు.

అంటే కేంద్రంలోని బీజేపీ భవిష్యత్తు అంతా ఈ ఇద్దరి మీదనే ఆధారపడి ఉంది అన్న మాట. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ సందర్భోచితంగా రేవంత్ ఈ హాట్ కామెంట్స్ చేశారా లేక నిజంగా అలాంటి ఆశలు ఇండియా కూటమిలో ఇప్పటికీ ఆరకుండా ఉన్నాయా అన్న డిస్కషన్ సాగుతోంది.

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చి గట్టిగా ఆరు నెలలు కాలేదు. ఏడాది లోగా కాంగ్రెస్ ప్రధాని అని రేవంత్ రెడ్డి అంటున్నారు అంటే మరో ఆరు నెలల వ్యవధిలో కేంద్రంలో పరిణామాలు ఏమైనా మారుతాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి బాబు నితీష్ లను ముగ్గులోకి లాగేశారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.