Begin typing your search above and press return to search.

ఇలాంటప్పుడే చంద్రబాబు.. కేసీఆర్ గుర్తుకొస్తారు రేవంత్?

అయితే.. వెంటనే స్పందించే రాజకీయ అధినేతల్లో మొదట చంద్రబాబు ఉంటారు. రెండోవారు కేసీఆర్ గా చెప్పాలి.

By:  Tupaki Desk   |   12 Feb 2025 6:30 AM GMT
ఇలాంటప్పుడే చంద్రబాబు.. కేసీఆర్ గుర్తుకొస్తారు రేవంత్?
X

రాజకీయాల్ని పక్కన పెట్టేద్దాం. అనుకోని ఆపద మీద వచ్చి పడినప్పుడు.. అందులో చిక్కుకుపోయినోళ్లు తెలుగోళ్లు అయితే.. వెంటనే స్పందించే రాజకీయ అధినేతల్లో మొదట చంద్రబాబు ఉంటారు. రెండోవారు కేసీఆర్ గా చెప్పాలి. నిజానికి ప్రాంతాలకు అతీతంగా రియాక్టు అయ్యే అధినేతగా చంద్రబాబును చెప్పాలి. తెలుగువారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసినంతనే.. వెంటనే వారికి ధైర్యాన్ని చెప్పటం.. అన్నీ తాము చూసుకుంటామంటూ వారి సొంత ఊళ్లకు తీసుకొచ్చేలా చేసే విషయంలో చంద్రబాబు..కేసీఆర్ ఎవరికి వారు ముందుంటారనే చెప్పాలి.

ఈ లోటు తాజాగా జరిగిన ఘోర ప్రమాదంలో రుజువైంది. మహా కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న హైదరాబాద్ వాసులు ఘోర ప్రమాదానికి గురి కావటం.. ఏడుగురు ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. నిజానికి ఇలాంటి విషాదం చోటు చేసుకున్నంతనే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రియాక్టు కావాలి. వెంటనే మంత్రుల టీంను ఏర్పాటు చేయటం.. వారిని హుటాహుటిన హెలికాఫ్టర్ ఇచ్చి అక్కడకు పంపాలి. బాధితులకు ధైర్యం చెప్పాల్సిన అవసం ఉంది.

కానీ.. అలాంటిదేమీ తాజా విషాదంలో కనిపించదు. జరిగిన ఘోర ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తన దిగ్భాంత్రిని వ్యక్తం చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం.. మిగిలిన వ్యవహారాల్ని అధికారులు చూసుకోవాలని ఆదేశించటమే కనిపిస్తుంది. ఇలాంటి విషాదం జరిగినంతనే..సదరురాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడటం.. సహాయ సహకారాల్ని అందించాలని కోరటం.. మంత్రుల టీం అక్కడకు వెళ్లి.. డెడ్ బాడీలను నగరానికి వేగంగా వచ్చేలా చూడటం లాంటివి చేయాలి కదా? గతంలో చోటు చేసుకున్న విషాదాల వేళలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించటం.. వారికి జరిగిన నష్టాన్ని పూడ్చలేకున్నా.. చేయగలిగినదంతా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్న భావన కలిగించేవారు.తాజా ఎపిసోడ్ లో సీఎం రేవంత్ నుంచి పెద్దగా రియాక్షన్ లేకపోవటం వల్లనేమో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందిచకుండా ఉండటం కనిపిస్తోంది. ఈ ఘోర ప్రమాదవేళ.. పలువురు నగరవాసులు చంద్రబాబును.. కేసీఆర్ ను గుర్తు తెచ్చుకోవటం చూసినప్పుడు.. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు అవకాశం ఇస్తున్నారు? అన్న సందేహం కలుగక మానదు. కాదంటారా?