ఏడాది సీఎం రేవంత్ రెడ్డి.... హిట్టా సూపర్ హిట్టా ?
రేవంత్ రెడ్డి మంత్రి కాకుండానే సీఎం అయ్యారు. ఆయన ఒకసారి ఎమ్మెల్సీ, రెండు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు
By: Tupaki Desk | 7 Dec 2024 12:00 PM GMTరేవంత్ రెడ్డి మంత్రి కాకుండానే సీఎం అయ్యారు. ఆయన ఒకసారి ఎమ్మెల్సీ, రెండు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు. ఆయన మొత్తం పద్నాలుగేళ్ల రాజకీయ జీవితంలో ఏకంగా ఏనుగు కుంభస్థలం కొట్టారు. తెలంగాణా సీఎం కావాలనుకున్నారు. ఆ లక్ష్యాన్ని కచ్చితంగా సాధించారు.
సరిగ్గా ఈ రోజుకు తెలంగాణా సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి ఏడాది అవుతుంది. కాంగ్రెస్ కి ఆయన ఆక్సిజన్ గా మారారు. ఆయన సీఎం ఆశలకు కాంగ్రెస్ ఆక్సిజన్ గా మారింది. ఇలా పరస్పరం ప్రేరితాలుగా రేవంత్ కాంగ్రెస్ అల్లుకుని పోయారు.
అలా చూస్తే కనుక రేవంత్ విజయం వెనక కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ సక్సెస్ వెనక రేవంత్ ఉన్నారు అని భావించాలి. అంటే ఒక రైట్ లీడర్ ఇన్ ద రైట్ పార్టీ అని కూడా చెప్పాల్సి ఉంది. ఇక రేవంత్ రెడ్డిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నయి. అందులో రెండవ మాటకు తావే లేదు. ఆయనకు కాంగ్రెస్ సంస్థాగత బలం తోడు అయి సీఎం అయ్యారు.
కేసీఆర్ వంటి ఉద్ధండుడుని ఢీ కొట్టి ఓడించి సీఎం కావడం అంటే మామూలు విషయం కాదు. దానికి కావాల్సిన దూకుడు మాటలో చతురత వ్యూహలు అన్నీ రేవంత్ రెడ్డిలో నిండుగా ఉన్నాయి. మరో వైపు చూస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మాత్రం కర్ణాటక సక్సెస్ మంత్ర నుంచి తీసుకున్నవి.
వాటిని జనంలో పెట్టి ప్రచారం చేసిన వారు రేవంత్ రెడ్డి. మరి ఆయన కాంగ్రెస్ వాదిగా ముఖ్యమంత్రిగా ఈ ఏడాది కాలంలో ఎంతవరకూ ఇచ్చిన హామీలను నెరవేర్చారు అంటే దానిని జాగ్రత్తగానే విశ్లేషించాలి. ఇక్కడ జనాలు చూసేది హామీల అమలు ఎన్ని అని కాదు, రేవంత్ రెడ్డిలో చిత్త శుద్ధి ఎంత అని. ఆ విధంగా వారికి రేవంత్ రెడ్డి ఒక నమ్మకం అయితే కలిగించారు.
ఇక ఆయన ఏడాది కాలంలో కొన్ని హామీలను నెరవేర్చారు. ఇక చూస్తే కనుక 2022 మే 7న వరంగల్‌లో జరిగిన రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీని ప్రకటించింది. దీని ప్రకారం లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిని అమలు చేసింది.
ఈ రుణమాఫీ అన్నది 2024 డిసెంబరు 2 నాటికి 25 లక్షల 35 వేల 964 మంది రైతులకు చేసినట్లు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే రైతు భరోసా ఇవ్వలేదని రుణమాఫీ కూడా అందరికీ దక్కలేదని విపక్షాల విమర్శలు అయితే ఉన్నాయి. కానీ ఈ హామీ కాంగ్రెస్ నెరవేర్చిన హామీగానే ఉంది.
అదే విధంగా వృద్ధాప్య పిన్షన్లను నెలకు నాలుగు వేల దాకా పెంచుతామని దివ్యాంగులకు ఆరు వేలకు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ అయితే ఇంకా నెరవేరలేదన్న విమర్శలు ఉన్నాయి. మరో వైపు యువ వికాసం పేరుతో ఇచ్చిన హామీ అమలు చేయలేదని అంటున్నారు. ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కింద 5 లక్షల విలువైన కార్డు. ప్రతి మండలంలో అంతర్జాతీయ స్కూల్స్ వంటివి ఏర్పాటు చేస్ద్తామని ఇచ్చిన హామీ అయితే ఏడాది కాలంలో తీరలేదు అని చెప్పాల్సి ఉంది.
మరో వైపు తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. అయితే గత ఏడాది కాలంలో 55,143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. అంటే నాలుగవ వంతు అన్న మాట. అయితే ఇది కొంత వరకూ నెరవేర్చిన హామీగానే చూడాల్సి ఉంది
విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తామని హామీ ఇచ్చారు కానీ విద్యా శాఖ మంత్రి లేరు అన్న విమర్శలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ప్రతీ రోజూ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పిన హామీ అయితే కొంత సడలించి వారంలో రెండు సార్లు నిర్వహిస్తున్నారు.
తెలంగాణా అమర వీరుల కుటుంబలకు ప్రభుత ఉద్యోగం ఇస్తామని హామీలు ఇచ్చారు కానీ అమలు చేయేలదు అంటున్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తామన్న మరో హామీ అలాగే ఉంది. విద్యా రంగంలో బడ్జెట్ ని ఆరు శాతం నుంది 12 శాతానికి పెంచుతామని ఇచ్చిన మరో హామీ అలాగే ఉంది.
ఇలా అనేక హామీల విషయం ఉన్నా రేవంత్ రెడ్డి మాత్రం తన ఏడాది పాలనలో జనాల మనసు చూరగొన్నారు అనే చెప్పాల్సి ఉంది. ఆయన బీఆర్ఎస్ ని రాజకీయంగా ధీటుగా ఎదుర్కొంటూనే ప్రజలకు చేరువ కావడానికి చూస్తున్నారు. అదే సమయంలో ఆయన తనదైన ఆలోచనలను పట్టుదలగా అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. దానికి ఉదాహరణ మూసీ నదీ సుందరీకరణ పనులు అని చెప్పాలి.
ఏది ఏమైనా కాంగ్రెస్ వంటి మహా సముద్రంలో ఏడాది పాటు ఎలాంటి అసంతృప్తులకు తావు లేకుండా సజావుగా పాలన పూర్తి చేయడం రేవంత్ రెడ్డి గ్రేట్ అచీవ్ మెంట్ అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఆయన ప్రజలతో నేరుగా కనెక్షన్ పెట్టుకున్నారు. కాబట్టి ఆయనకు ఇబ్బంది అయితే రాజకీయంగా ఇప్పట్లో లేదనే చెప్పాలి. రేవంత్ రెడ్డి ఏడాది పాలన బ్లాక్స్ బస్టర్ అయితే కాదు, సూపర్ హిట్ అనలేం, కానీ అన్ని ఒడిదుడుకుల మధ్యన సాగిన ఈ పాలన హిట్ అంటే మాత్రం తప్పు అయితే లేదు అన్నది ఒక విశ్లేషణ.'